'చిరుత’ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ టాలీవుడ్ లో సరైన అవకాశాలను అందుకోలేక పోయింది. ‘చిరుత’ అనుకున్నంత విజయం సాధించలేక పోవడంతో నేహాశర్మ కెరియర్ అక్కడితో ముగిసి పోయింది. అయితే ప్రేక్షకులందరూ మరిచిపోయిన నేహ శర్మను తిరిగి రామ్ గుర్తుకు చేస్తున్నాడు.
దీనికి కారణం రామ్ తన సొంత సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్ లో నటిస్తున్న ‘శివం’ సినిమాకు నేహ శర్మ సోదరి ఐషా శర్మను హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు మహేష్ నటిస్తాడు అని ప్రచారం జరిగిన ‘శివం’ టైటిల్ ను ఎంచుకోవడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ స్పాట్ లో లేటెస్ట్ గా ఐషా శర్మ చేరికతో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు ఖరార్ అయింది. డాన్స్ లో, ఫైట్స్ లో శిక్షణ తీసుకున్న ఐషా శర్మను అనేక ఆడిషన్స్ తరువాత ఈ సినిమాలో బుక్ చేసుకున్నట్లు ఈ సినిమా దర్శక నిర్మాతలు చెపుతున్నారు.
రామ్ చరణ్ హీరోగా టాలీవుడ్ ను ఏలుదామని ఆశించి భంగ పడ్డ నేహా శర్మ కలలను కనీసం ఆమె చెల్లెలు ఐషా శర్మ అయినా నెరవేర్చా కలుగుతుందో లేదో చూడాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78845/RAM-BEHIND-CHIRUTHA-SISTER/

0 comments:
Post a Comment