Menu

pataas-kalyan-ram
అప్పుడప్పుడు ఒకరు వదిలేసిన అవకాశం ఇంకొకరికి అదృష్టంగా మారిపోతూ ఉంటుంది. గతంలో ఇటువంటి సంఘటనలు టాలీవుడ్ లో చాలానే జరిగాయి. ప్రిన్స్ మహేష్ బాబుతో ‘ఆగడు’ సినిమా తీస్తున్న సమయంలో ఆ సినిమాకు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన అనీల్ రావిపూడి రాసిన కామెడీ ట్రాక్ సీన్స్ లో ‘పటాస్’ సినిమాలో వచ్చిన 801 అంబులెన్స్ చుట్టూ తిరిగిన ‘పార్థాయ’ కామెడీ సీన్స్ రాసి హీరో మహేష్ బాబుకు దర్శకుడు శ్రీనువైట్లకు వినిపించాడట అనీల్ రావిపూడి. అయితే ఈ కామెడీ సీన్స్ మరీ అతిగా ఉన్నాయి అని మహేష్ బాబు కామెంట్ చేయడంతో ఈ కామెడీ ట్రాక్ ను తాను దర్శకత్వం వహించిన ‘పటాస్’ లో  ప్రయోగించాడట అనీల్. ఈ కామెడీ సీన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో ‘పటాస్’ సూపర్ సక్సస్ కావడమే కాకుండా కళ్యాణ్ రామ్ ఇంట కనకవర్షాన్ని కురిపిస్తోంది. దీనితో ‘ఆగడు’ లోని సీన్ ‘ప‌టాస్’ హిట్ కారణంగా మారింది.
ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సంవత్సర ప్రారంభంలో విడుదలైన మొట్టమొదటి సూపర్ హిట్ గా ‘పటాస్’ తన హవాను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల కలెక్షన్స్ స్థాయిని దాటింది అనే వార్తలు వస్తున్నాయి. మరొక ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదల కాకముందు శాటిలైట్ రైట్స్ గురించి పట్టించుకోని చాల ఛానల్స్ ఈ సినిమా అనుకోని సూపర్ హిట్ సాధించడంతో ‘పటాస్’ పై విపరీతమైన మోజుతో జీ తెలుగు ఛానల్ 4.30 కోట్లకు ‘పటాస్’ శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకుంది అనే వార్తలు వినపడుతున్నాయి.
ఏది ఎలా ఉన్నా ‘పటాస్’ ఇచ్చిన ఉత్సాహంతో కళ్యాణ్ రామ్ ఏకంగా నందమూరి బాలకృష్ణ 100వ సినిమాను తానే నిర్మిస్తాను అని ప్రకటించే స్థాయికి కళ్యాణ్ రామ్ ను ఈ సినిమా ఘన విజయం మంచి జోష్ లో ఉంచింది.

0 comments:

Post a Comment

 
Top