March 15, 2025 12:24:07 AM Menu
Latest

6:28 PM test1


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ చిత్రాలను తెరకెక్కించే శంకర్ అంటే ప్రతి ఒక్కరికీ క్రేజే. అయితే శంకర్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ఐ. చాలా చిన్న సబ్జెక్ట్ ని తీసుకొని భారీ చిత్రంగా హంగులు అద్ధి, సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా తెరక్కించాడు శంకర్. అయితే శంకర్ నుండి రావాల్సిన చిత్రం ఐ కాదని, అందరూ మూవీని చూస్తూనే పెదవి విరిచేశారు. దీంతో ఐ మూవీకి రిపీటెడ్ ఆడియన్స్ తగ్గిపోయారు.

ఐ మూవీకి రిలీజ్ రోజే నెగిటివ్ టాక్ రావడంతో, చాలా మంది ధియోటర్స్ కి వెళ్ళటమే మానుకున్నారు. ఇదిలా ఉంటే శంకర్ తన అప్ కమింగ్ ఫిల్మ్ ఎవరితో తీస్తున్నారనే న్యూస్ ఇప్పుడు హాట్ హాట్ గా వినిపిస్తుంది. శంకర్ తన ఐ మూవీ తరువాత, కోలీవుడ్ టాప్ హీరో అజిత్ తో జోడి కట్టబోతున్నాడు. ఈ మూవీకి నిర్మాతగా ఎ.ఎం.రత్నం ఉంటున్నాడు. ఇప్పటి కే వీరిద్దరి మధ్యన స్టోరికి సంబంధించిన డిస్కషన్స్ పూర్తై, అజిత్ గ్రీన్ సిగ్నల్ కూడ ఇవ్వటం జరిగిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

అజిత్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీలో శంకర్ కి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలి అన్నది.. నిర్మాతల వద్ద ప్రశ్నగా మారింది. ఐ మూవీకి శంకర్ దాదాపు 30 కోట్ల రూపాయలకు మించి రెమ్యునరేషన్ తీసుకున్నాడు. కాని ప్రస్తుతం అంత సీన్ లేదనిపిస్తుంది. నిర్మాత శంకర్ కి కేవలం 12 కోట్ల రూపాయలనే రెమ్యునరేషన్ గా ఇవ్వగలని క్లియర్ గా చెప్పాడంట. ప్రస్తుతం శంకర్ రెమ్యునరేషన్ పై చిత్ర యూనిట్ లో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. 

source:http://www.apherald.com/Movies/ViewArticle/76887/Shankar-I-movie-I-film-kollywood-ajith-ajith-kolly/
23 Jan 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top