Menu


వరస ఫ్లాపులతో ముందుకు వెళ్తున్న నాని కొత్త చిత్రం కమిటయ్యారు. శేఖర్ కమ్ముల శిష్యుడు నాగి అనే యువ దర్శకుడు డైరక్షన్ లో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ నిర్మాతగా స్వప్న సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ చిత్రం కుకూ ఫేమ్ మాళవిక నాయర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది. ఇక నాని తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తూ, అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘జెండాపై కపిరాజు'. చాలా కాలంగా ఈ సినిమాకి రిలీజ్ తేదీలుప్రకటించటం, అవేమో వాయిదా పడడం జరుగుతూ వస్తోంది. ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు. అయితే రీసెంట్ గా ఈ చిత్రం యూనిట్ ... ఆగష్టు 8వ తేదీని విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే మళ్లీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఇవ్వలేదు. బిజినెస్ సమస్యలతో చిత్రం విడుదల ఆపినట్లు తెలుస్తోంది. తమిళంలోనూ ఈ చిత్రం వెర్షన్ విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఆ ఎఫెక్టు ఇక్కడ బిజినెస్ పై పడుతోంది.

నాని మాట్లాడుతూ ''మనల్ని మనం సరిదిద్దుకుంటే ప్రపంచం సరైన స్థితిలో ఉంటుందనే అంశంపై నడిచే సినిమా ఇది. తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. సమాజానికి సందేశాన్నిచ్చే ఇలాంటి చిత్రంలో పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమాలో మూడు నిమిషాలు ఉండే పోరాట సన్నివేశాన్ని 24 రోజులు చిత్రీకరించాం. ఇప్పుడు దాన్ని తెరపై చూసుకుంటే ఆ కష్టమంతా మరచిపోయాను''అని చెప్పారు. ''తెలుగు తెరపై త్వరలో ఓ మంచి సినిమాను విడుదల చేయబోతున్నాం. జీవీ ప్రకాష్‌కుమార్‌ అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు నిర్మాణ సంస్థకు చెందిన మల్టీడైమన్షన్‌ వాసు. వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై కె. శ్రీనివాసన్ నిర్మిస్తున్న "జెండాపైకపిరాజు'' చిత్రాన్ని మల్టిడైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సమర్పిస్తున్నారు. శివబాలాజీ, తనికెళ్లభరణి, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రధారులు. .ఆహుతి ప్రసాద్‌, శివబాలాజీ, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.


0 comments:

Post a Comment

 
Top