తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ప్రచారానికి కర్నాటకకు చెందిన ఐటి ప్రోఫిషినల్ అభిషేక్ అనే వ్యక్తి కారణం అని టాక్. ఇక వివరాలలోకి వెళితే హంపి కట్టడాలకు ఉన్న చారిత్రాత్మక నేపధ్యం రీత్యా ఆ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు వైబ్రేషన్స్ ఎఫక్ట్ కలిగించకుండా అతి తక్కువ లైటింగ్ తో ఆ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోవాలని నియమ నిబంధనలు ఉన్నాయట.
అయితే ఈ నిబంధనలకు భిన్నంగా అక్కడ రకరకాల లైటింగ్స్ తో కూడిన కెమెరాలను వాడుతూ ఆ చారిత్రక కట్టడాలకు దగ్గరగా విపరీతమైన శబ్దం, ధూళితో రవితేజ ‘కిక్-2’ షూటింగ్ జరుపు కోవడం వల్ల ఇప్పటికే దెబ్బతిని ఉన్న ఆ కట్టడాలకు మరింత హాని జరుగుతుందని తెలియచేస్తూ అభిషేక్ ఆ షూటింగ్ స్పాట్ ఫోటోలను వెబ్ మీడియాలో పెడుతూ రవితేజా వల్ల హంపి కట్టడాలకు చెడు జరుగుతోంది అన్న ప్రచారాన్ని అభిషేక్ మొదలు పెట్టాడని తెలుస్తోంది.
అయితే ఈ చారిత్రక కట్టడంలో తాము షూటింగ్ జరుపుకోవడానికి అనుమతులు తీసుకున్నామని ఈ సినిమా యూనిట్ చెపుతున్నా హంపీలో జరిగిన ఈ సినిమా షూటింగ్ పై వెబ్ మీడియాలో ఇంత రగడ జరగడం రవితేజాకు తల నొప్పిగా మారిందని టాక్.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78835/HAMPI-BECOMING-TA-ARCHER--TO-RAVITEJA/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.