సినిమా షూటింగ్ లలో విలన్స్ తో భీకర పోరాటాలు చేసే హీరోలు నిజజీవితంలో పోరాటాలు చేయలేరు సరికదా ఏమైనా అనుకోని సమస్యలు జీవితాలలో ఎదురైతే తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. అలాంటిది తీవ్రమైన అలల ఒత్తిడిలో ఉన్న సముద్రానికి ఎదురీది తమ సినిమా యూనిట్ సభ్యుడిని కాపాడిన ఒక బాలీవుడ్ హీరో చేసిన సాహసం ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాలలోకి వెళితే బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ పేరు తెలియని వారుండరు. ‘3 ఇడియట్స్’, ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో ఇతడు. ప్రస్తుతం అనేక సినిమాలలో నటిస్తున్న ఈ హీరో లేటెస్ట్ గా బాలీవుడ్ లో ‘దిల్ దడ్కనే దో’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం టర్కీ లోని అoటోలియా పరిసర ప్రాంతాలలో ఒక సముద్రం ఒడ్డున ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.
అయితే ఈ సినిమా షూటింగ్ కు ఫర్హాన్ అక్తర్ తనకు హెయిర్ డ్రెస్సర్ గా హీరో రణవీర్ సింగ్ దగ్గర పనిచేస్తున్న దర్శన్ అనే హెయిర్ డ్రెస్సర్ ను ముంబాయి నుండి టర్కీకి ఫర్హాన్ అక్తర్ తీసుకు వెళ్ళాడు. అయితే దర్శన్ అందమైన ఆ సముద్రాన్ని చూడగానే సముద్రంలోకి ఈత కొట్టడానికి వెళ్ళాడట. అయితే అనుకోకుండా ఒకేసారి అలల మధ్య చిక్కుకు పోవడంతో దర్శన్ సముద్రంలో మునిగిపోయే పరిస్థితికి దగ్గరయ్యాడు.
ఈ పరిస్థితిను సముద్రపు ఒడ్డున చూస్తున్న ఈ యూనిట్ సభ్యులు కేకలు వేస్తున్నా ఎవరూ అక్కడ పట్టించుకోలేదని తెలుస్తోంది. దీనితో ధైర్యం చేసి ఫర్హాన్ అక్తర్ ఆ అలలకు ఎదురీదుతూ వెళ్ళి తన హెయిర్ డ్రెస్సర్ ను మరణం నుంచి తప్పించాడట. ఇప్పుడు ఈ వార్తలు బయటకు రావడంతో ఫర్హాన్ అక్తర్ రియల్ హీరో అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది..
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78244/BOLLYWOOD-HERO-SAVED-YOUNG-PERSON-LIFE/

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.