Menu

టాలీవుడ్ పెద్ద హీరోల సినిమాలు రిలీజైతే చాలు అప్పటి వరకు ఉన్న రికార్డులు కలెక్షన్లు, మొదలవుతాయి. ఇప్పటి వరకు ఆయా ఏరియాల్లో వారం రోజుల్లో అత్యధిక షేర్ సాధించిన సినిమాల విషయానికొస్తే. పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం టాప్ లో ఉంది. తాజాగా ‘టెంపర్' విడుదలైన విజయవంతంగా దూసుకెలుతున్న నేపథ్యంలో ఆ సినిమా కలెక్షన్లను ఇప్పటి వరకు వచ్చి టాప్ మూవీ కలెక్షన్లతో బేరీజు వేస్తూ విశ్లేషణలు మొదలయ్యాయి.

టెంపర్ మూవీ విడుదలై బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ కలెక్షన్ల పరిశీలిస్తే నైజాం: రూ. 9.12 కోట్లు, సీడెడ్: రూ. 5.30 కోట్లు, వైజాగ్: రూ. 2.45 కోట్లు, గుంటూరు: రూ. 2.52 కోట్లు, కృష్ణ: రూ. 1.71 కోట్లు, ఈస్ట్: రూ. 1.90 కోట్లు, వెస్ట్: రూ. 1.42 కోట్లు, నెల్లూరు: రూ. 1.02 కోట్లుగా ఉంది.2015లో ఇప్పటి వరకు టెంపరే టాప్.

ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మూడో బిగ్గెస్ట్ ఓపెనర్ గా టెంపర్ రికార్డుల కెక్కింది. మొదటి, రెండో స్థానాల్లో అత్తారింటికి దారేది, ఎవడు చిత్రాలు ఉన్నాయి. ఏదేమైనా ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగా టెంపర్ మరిన్ని టాప్ రికార్డులు సాధిస్తుందని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79384/movie-pawan-kalyan-attarintiki-daredi-the-big-hits/

0 comments:

Post a Comment

 
Top