Menu


విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఆ పాత్రలలో ఒదిగి పోయి ఎంత కష్టమైనా మెప్పించగల నేర్పు కమలహాసన్ కు వెన్నతో పెట్టిన విద్య. ఈ ప్రత్యేకత వల్లే 60 సంవత్సరాల వయస్సుకు కమల్ దగ్గర పడుతున్నా ఆయన సినిమాల పై ప్రేక్షకులలో క్రేజ్ తగ్గడం లేదు.

ఈ సంవత్సరం మూడు వెరైటీ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కమల్ మరో ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం డిసెంబర్ లో విడుదలై బాలీవుడ్ రికార్డులను తిరగ రాసిన అమీర్ ఖాన్ ‘పీకే’ సినిమాను తమిళ తెలుగు భాషలలో రీమేక్ చేయబోతున్న జెమిని ప్రొడక్షన్స్ ఆలోచనల వెనుక కమల్ ప్రోత్సాహం ఉంది అని వార్తలు వస్తున్నాయి.

ఈ రీమేక్ లో కమల్ నటిస్తానని ఒప్పుకున్నా తరువాత ‘పీకే’ రీమేక్ రైట్స్ ను జెమిని సంస్థ చాల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రీమేక్ విషయంలో అనేక మంది దక్షిణాది ప్రముఖ హీరోలు ఆలోచనలు చేసినా చివరికి ఎవరూ సాహసించలేకపోయారు. అయితే కమల్ ఈ సినిమాను ఒక ఛాలెంజ్ గా తీసుకుని నటించడం ఇప్పుడు దక్షిణాది సినిమా రంగానికి హాట్ న్యూస్.

‘పీకే’ సినిమా పై ఎన్నో వివాదాలు వచ్చాయి. అయితే ఆ వివాదాలు ఆ సినిమా సూపర్ సక్సస్ ను ఆపలేక పోయాయి. అయితే మళ్ళీ ఈ వివాదాలు కమలహాసన్ ను వెంటాడతాయా అన్నది సమాధానంలేని ప్రశ్న. ఈ సినిమా షూటింగ్ మే నెల ప్రాంతం నుంచి ప్రారంభం అవుతుంది అని అంటున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78303/KAMAL-HASSAN-BECOMES-SENSATIONAL/

0 comments:

Post a Comment

 
Top