జూనియర్ వీరాభిమాని ఎమ్. రాధ వెబ్ మీడియాలో జూనియర్ ను ఉద్దేశిస్తూ వ్రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది డేగా మారింది. ‘డియర్ జూనియర్ ఎలియాస్ టెంపర్ దయ’ అంటూ సాగిన ఈ సుధీర్ఘ ఉత్తరంలో ఎన్నో విషయాలను ఆ వీరాభిమాని జూనియర్ దృష్టికి తీసుకు వచ్చాడు. కోలీవుడ్ సినిమా రంగంలో రజినీకాంత్, కమలహాసన్ లేటెస్ట్ గా ధనుష్ వెరైటీ సినిమాలను చేస్తూ ఉంటే అటువంటి సినిమాలను తెలుగులో చేయగల సత్తా కేవలం జూనియర్ కు మాత్రమే ఉందని ‘టెంపర్’ లోని దయా పాత్ర రుజువు చేసిందని కామెంట్ చేసాడు ఆ వీరాభిమాని.
ఈ సినిమా తరువాత తాము జూనియర్ అభిమానులమని గర్వంగా చెప్పుకునే అవకాశం వచ్చిందని ఆనంద పడుతున్నాడు రాధ. 40 కోట్లు 50 కోట్లు 80 కోట్లు కలెక్షన్స్ తో జూనియర్ ను చూడకూడదని ఈ కలెక్షన్స్ ఫిగర్స్ కన్నా చాల పెద్దది జూనియర్ క్రేజ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
‘రాఖీ’ సినిమాలో జూనియర్ లోని నటుడు బయటకు వస్తే ‘యమదొంగ’ సినిమా ద్వారా జూనియర్ లోని డైలాగ్ పవర్ బయట పడితే జూనియర్ నట విశ్వరూపాన్ని బయటకు తీసిన సినిమా ‘టెంపర్’ అంటూ తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు రాధ. అంతేకాదు ఇప్పటి దాకా అమ్మాయిల ఫాలోయింగ్ లో వెనుక పడ్డ జూనియర్ ‘టెంపర్’ తో మారిన జూనియర్ లుక్ తో రానున్న రోజులలో జూనియర్ అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా మారబోతున్నాడు అంటూ జోష్యం చెప్పాడు.
మహేష్ నటించిన ‘వన్ నేనొక్కడినే’ లాంటి సైకలాజికల్ సినిమాలలో నటించి అటువంటి సినిమాలను కూడా బ్లాక్ బస్టర్ చేయగల సత్తా ఒక్క జూనియర్ కు తప్ప టాలీవుడ్ లో మరెవ్వరికీ లేదు అంటూ తన అభిమానాన్ని సుధీర్ఘ ఉత్తరంగా మార్చి తన భావాలను తెలియచేసిన రాధ అభిప్రాయాలు జూనియర్ అభిమానులను ‘టెంపర్’ సక్సస్ ఏ రేంజ్ లో జోష్ లో ముంచెత్తి వేసిందో అర్ధం అవుతుంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79566/OPEN-LETTER-TO-JUNIOR/

0 comments:
Post a Comment