Menu

పవన్ అయోమయంతో మరో దర్శకుడు అగమ్యగోచరంలో పడిపోతున్నాడు అంటూ ఫిలింనగర్ లో వార్తల హడావిడి వినిపిస్తోంది. చాల మంది టాప్ హీరోలులా వరస పెట్టి సినిమాలు చేయడానికి పవన్ ఇష్టపడక పోయినా ఎందరో దర్శకులు పవన్ అంగీకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

‘రచ్చ’ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత దర్శకుడు సంపత్ నంది పవన్ ‘గబ్బర్ సింగ్2’ మాయలో పడి విలువైన రెండు సంవత్సరాలు వృధా చేసుకోవడమే కాకుండా ఎన్నో అవకాశాలను పోగొట్టుకున్నాడు అనే వార్తలు ఉన్నాయి. చివరికి అదృష్టం కలిసి వచ్చి రవితేజ ‘బెంగాల్ టైగర్’ దొరకకుంటే సంపత్ నంది పరిస్థితి పై అందరు జాలి పడేవారు. ప్రస్తుతం మరో దర్శకుడి పరిస్థితి కూడా ఇలాగే జరగబోతోందా? అంటూ సెటైర్లు పడుతున్నాయి.

‘గబ్బర్ సింగ్2’ కోసం సంపత్ నంది స్థానంలో దర్శకుడు బాబి ఎంపిక అయి 6 నెలలు దాటి పోతున్నా ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో దర్శకుడు బాబికే చెప్పలేని స్థితి ఏర్పడటంతో ఈ దర్శకుడు కూడా అయోమయంలో రోజులు గడిపేస్తున్నాడు అని టాక్. రవితేజాతో ‘పవర్’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీకి అనుకోని అదృష్టంగా పవన్ సినిమా వచ్చింది అనుకుంటే గడపదాకా వచ్చిన అదృష్టం ఇంట్లోకి రానట్లుగా అసలు పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ ఎప్పుడు మొదలు పెడతాడో తెలియని పరిస్థితిలో ఉన్న బాబి స్థితి పై కూడా సెటైర్లు పడుతున్నాయి.

ఈరోస్ లాంటి బడా సినిమా సంస్థలు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నా దర్శకుడు బాబి పవన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నా రాజకీయాల పైనే కాదు తన సినిమాల విషయం పై కూడా పవన్ ప్రవర్తిస్తున్న వింత అయోమయంలో మరో దర్శకుడు చిక్కుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79419/ANOTHER-DIRECTOR-GOT-TRAPPED-WITH-PAVAN/

0 comments:

Post a Comment

 
Top