Menu

మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నాని గత మూడు సంవత్సరాలుగా సరైన హిట్ లేక టాలీవుడ్ హీరోల రేసులో చాల వెనక పడిపోయాడు. ఇలాంటి పరిస్థుతులలో త్వరలో విడుదల కాబోతున్న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా గురించి చాల కష్టపడటమే కాకుండా ఆ సినిమా పై చాల ఆశలు పెట్టుకున్నాడు.

నిన్న సాయంత్రం జరిగిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చాల విభిన్నంగా జరగడమే కాకుండా ఈ కార్యక్రమకనికి టాలీవుడ్ కు చెందిన అనేక మంది యంగ్ హీరోలు ప్రముఖ దర్శకులతో పాటు జూనియర్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా వచ్చి నాని పై ప్రశంసల జల్లు కురిపించాడు.

తన మొట్టమొదటి విజయం ‘స్టూడెంట్ నెంబర్ వన్’ ను నిర్మించిన అశ్వనీ దత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న దత్ లు ఈ సినిమాను నిర్మిస్తూ ఉండటంతో తన సినిమాలాగానే నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కూడ సూపర్ హిట్ అవుతుందని ఆకాంక్షించాడు. అంతేకాదు తనకు నాని నటించిన ‘పిల్ల జమిందార్’ సినిమా అంటే ఎంతో ఇష్టమని ఈ సినిమాను ఎన్ని సార్లు చూసానొ లెక్కే లేదని అంటూ ఈ సినిమా తన భార్యకు కూడా చాల ఇష్టం అంటూ కామెంట్ చేసాడు జూనియర్

నిన్న జరిగిన ఈ ఆడియో ఫంక్షన్ కు టాలీవుడ్ టాప్ సెలెబ్రెటీలు రాజమౌళి, కీరవాణి, క్రిష్, శర్వానంద్ లాంటి ఎందరో సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయి నానీకి మానసికంగా ధైర్యాన్ని కలిగించడమే కాకుండా నాని సక్సస్ ను కోరుకుంటూ మాట్లాడటంతో నానీకి టాలీవుడ్ లో ఎంతబలం ఉందో తెలిసే ఫంక్షన్ గా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఆడియో వేడుక చాల విభిన్నంగా జరిగింది.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79508/JUNIOR-AT-THE-RESCUE-OF-NANI/

0 comments:

Post a Comment

 
Top