Menu

యాంకర్ ప్రదీప్ నిర్వహిస్తున్న ‘కొంచెం టచ్ లో ఉంటే చెపుతా’ కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న రకుల్ ప్రీత్ త్రిష, తమన్నా లపై వేసిన సెటైర్లు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి. ఇప్పుడిప్పుడే టాప్ స్థానంలోకి వస్తున్న రకుల్ ఏకంగా సీనియర్ హీరోయిన్స్ ను ఎటువంటి భయం లేకుండా టార్గెట్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

ఈ కార్యక్రమంలోని ర్యాపిడ్ రౌండ్ లో యాంకర్ ప్రదీప్ కొంత మంది పేర్లు చెప్పి వారి గురించి సింగిల్ పదంలో అభిప్రాయాన్ని చెప్పమంటే రకుల్ తమన్నా త్రిష లపై ఈ అభిప్రాయాలను తెలియ చేసింది. చెన్నై బ్యూటీ త్రిష ట్విటర్ సంభాషణలకు మిల్కీ బ్యూటీ తమన్నా షాప్ ఓపెనింగ్స్ కు బాగా పనికొచ్చే వ్యక్తులని కామెంట్ చేయడం ఆ కార్యక్రమాన్ని చూస్తున్న వారికి షాక్ ఇచ్చింది.

దశాబ్ద కాలంగా టాలీవుడ్ కోలీవుడ్ లలో టాప్ హీరోయిన్స్ గా వెలుగొందుతున్న ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలలో నటిస్తే వీరికి ఈ కొత్త ఇమేజ్ ని రకుల్ క్రియేట్ చేయడం రకుల్ లోని ధైర్యాన్ని సూచిస్తోంది. ఇప్పటికే రకుల్ హవాతో అధిరిపోతున్న దక్షిణాది హీరోయిన్స్ అంతా ఏకమై ఈ కామెంట్స్ నేపధ్యంలో రకుల్ పై ఎటువంటి ఎత్తుగడలు వేస్తారో చూడాలి.

ప్రస్తుతం టాప్ హీరోలలో రాఖీ కట్టవలసి వస్తే ఎవరికీ రాఖి కడతావు అని యాంకర్ ప్రదీప్ ఇదే కార్యక్రమంలో అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు టాలీవుడ్ లో ఎవరూ సోదరులు లేరని తెలివిగా సమాధానం ఇస్తూ తాను అందరితోను హీరోయిన్ గా నటించడానికి రెడీ అంటూ సంకేతాలు తెలియచేసింది.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79567/RAKULPREETH-SATIRES-ON-TRISHA-AND-TAMANNAH/

0 comments:

Post a Comment

 
Top