Menu

కొద్ది రోజుల వరకు చిరంజీవి 150వ సినిమా గురించి కామెంట్లు చేస్తూ హడావిడిగా గడిపిన రామ్ గోపాల వర్మ ప్రస్తుతం మంచు మనోజ్ తో ‘ఎటాక్’ లాంటి భారీ సినిమాను తీస్తున్న వివాదాల రామ్ గోపాల వర్మ దృష్టి ఇప్పుడు ఏకంగా మహాభారతం పై పడింది. అంతేకాదు మహాభారతాన్ని వ్రాసిన వ్యాస మహర్షి రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ దగ్గర రాయడం ఎలా నేర్చుకోవాలో తెలుసుకుంటే బాగుటుంది అంటూ షాకింగ్ ట్విట్స్ పెడుతున్నాడు.

చేస్తూ మహిళలను మహా భారతంలో ఎంత నీచంగా చిత్రీకరించారో తన అభిప్రాయాలను ఆ పుస్తకంలో ఆమె పొందు పరచింది. ఈమధ్యన ఈ రచయిత్రి ‘ఇదండీ మహాభారతం’ అంటూ ఒక సంచలన పుస్తకాన్ని వ్రాసింది. మహాబారతం లోని ధర్మరాజు నుండి ద్రౌపది వరకు అటు పాండవులను ఇటు కౌరవులను టార్గెట్

గతంలో రామాయణానికి సెటైర్ గా రామాయణ విషవృక్షం పుస్తకాన్ని వ్రాసి సంచలనాన్ని సృస్టించిన ఈమె రాసిన ఈ సరికొత్త సెటైర్ ‘ఇదండీ మహాభారతం’ పుస్తకాన్ని వర్మ ఇప్పటి వరకు 100 సార్లు చదివాడట. ఆమె అంగీకరిస్తే త్వరలో ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఒక సినిమా తీస్తాను అంటూ ట్విట్ చేసాడు.

నిన్నటి రోజున వర్మ ఇక చిన్న సినిమాలు తీయను తన దృష్టి అంతా బడా సినిమాల పైనే దృష్టి పెడతాను అని చెప్పి, ఒక్కరోజు గడవ కుండానే మహాభారతాన్ని ఏకంగా వ్యాసుడుని టార్గెట్ చేయడం చూస్తూ ఉంటే వర్మ మరో సంచలనానికి రెడీ అవుతున్నట్లుగా అనిపిస్తోంది. అందుకే రామ్ గోపాల వర్మ ఎవరికీ అర్ధం కాడు అని అంటారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/80117/YESTER-DAY-CHIRANJEEVI-TODAY-MAHABHARATHAM-/

0 comments:

Post a Comment

 
Top