సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పేరు మీద సెటైరిక్‌గా ‘ఎ శ్యాం గోపాల్ వర్మ’ అనే టైటిల్‌తో చిత్రం రాబోతోంది. షఫి అనే నటుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో జోయాఖాన్ హీరోయిన్. రక్తపాతాలు, హింస సన్నివేశాలతో సినిమాలు తీసే ఓ దర్శకుడు చివరికి ఎలాంటి ఫలితాలు అనుభవించాడన్నదే ఈ మూవీలో చూపామని డైరెక్టర్ రాకేశ్ శ్రీనివాస్ అంటున్నారు. హారర్, సస్పెన్స్ కలగలిపి దీనిని తీస్తున్నట్టు ఆయన చెప్పాడు.
‘ఎ శ్యాం గోపాల్ వర్మ’ సినిమా ఫస్ట్ టీజర్‌ని సోమవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. దర్శకుడు రెండేళ్ళు కష్టపడి రాసుకున్న కథ ఇదని, వాస్తవిక పాత్రల్ని ఇష్టపడే తాను ఈ మూవీలో నటించేందుకు అంగీకరించానని షఫి చెప్పాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి..వారంలో మొదటి కాపీ సిద్ధమవుతుంది..సెన్సార్‌కు పంపి త్వరలో సినిమా విడుదల చేస్తామని నిర్మాత వి.విజయకుమార రాజు తెలిపారు. జీవా, ఎల్బీ శ్రీరాం, మంత్ర ఆనంద్ తదితరులు ఇందులో నటిస్తున్నారు.
0 comments:
Post a Comment