Menu

dhanush-jrntr

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ మూవీ రిలీజ్ అవుతుందంటే చిన్న మూవీలు అన్నీ పక్కకు జరిగిపోవాల్సిందే. అలాగే పెద్ద మూవీలు సైతం స్నేహపూర్వకంగా ఓ వారం రోజుల తరువాత రిలీజ్ చేసుకుంటారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ నటించిన అప్ కమింగ్ మూవీ టెంపర్ రిలీజ్ రోజునే, ఓ హీరో మూవీ రిలీజ్ అవుతుంది.

వివరాల్లోకి వెళితే, జాతీయ అవార్డు గ్రహిత ధనుష్ కు తమిళ, హిందీ ప్రేక్షకుల నుండి మంచి ఫ్యాన్ బేస్ లభించింది. అతని సినిమాలు కొన్ని తెలుగులో విడుదలైనా ఇక్కడ ధనుష్ కి ఆశించినంత పేరు రాలేదు. అయితే ఈ లోటుని ‘రఘువరన్ బీటెక్’ సినిమా తీర్చేసింది. ఈ సినిమా తెలుగులో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ధనుష్ చిత్రాలలకు తెలుగులో డిమాండ్ క్రియేట్ అవుతుంది.

అను నటించే అప్ కమింగ్ మూవీలు అన్నీ ఇక నుండి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ఇక్కడి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఆ విధంగానే కె.వి ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ అప్ కమింగ్ ఫిల్మ్మా ‘అనేగన్’ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈసినిమా ను తమిళంలో ఫిబ్రవరి 13 రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంట.

అదే రోజున తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ధనుష్ ప్లాన్ చేసుకున్నాడని కోలీవుడ్ టాక్. కానీ అదే రోజున పూరి జగన్నాథ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన 'టెంపర్' రిలీజ్ కాబోతోంది. జూనియర్ మార్కెట్ వేరు, తన మార్కెట్ వేరు అంటూ తను నటించిన అనేగన్ మూవీని ఒకే సారి తెలుగులోనూ రిలీజ్ చేయాల్సిందిగా నిర్మాతలను కోరాడంట.

source:http://www.apherald.com/Movies/ViewArticle/77567/Dhanush-jr-ntr-jr-ntr-film-telugu-film-temper-aneg/

0 comments:

Post a Comment

 
Top