Menu


రాజమౌళి కుటుంబ నేపధ్యానికి సంబంధించిన ఒక ఆ శక్తికర విషయాన్ని స్వయంగా రాజమౌళి లీక్ చేసాడు. ఇప్పటి దాకా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా రాజమౌళిని భావిస్తూ ఉంటే అసలు సీక్రెట్ ను బయట పెట్టాడు రాజమౌళి. తన కుటుంబ సభ్యులందరికీ తుంగభద్రానది అంటే చాల ఇష్టం అని దీనికి కారణం తన కుటుంబం అంతా ఆ ప్రాంతానికి చెందిన వారమే అని చెప్పాడు జక్కన్న.

ఇప్పుడు అదే టైటిల్ తో తన ప్రియ మిత్రుడు కొర్రపాటి సాయి సినిమాను తీస్తూ ఉండటం తనకు ఎంతో ఆనందం కలిగించిది అని అంటున్నారు. మంచి ట్విస్ట్ తో కొనసాగే ఈ సినిమాను శ్రీనివాస్ కృష్ణ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా క్లైమాక్స్ చాల అద్భుతంగా ఉంటుంది అని ఫిలింనగర్ టాక్

అంతా కొత్త వారితో నిర్మింపబడిన ఈ సినిమాకు విడుదల కాకుండానే ఫిలింనగర్ లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సాయి కొర్రపాటి నిర్మించిన సినిమాలు అన్నీ విజయవంతం అవుతూ ఉండటంతో ఈ సినిమాకు బయ్యర్ల నుండి అప్పుడే మంచి డిమాండ్ వస్తోంది అని టాక్.

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ఊహించని విజయాలను అందుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమా కూడా విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేసిన సినిమాలు చాల మటుకు విజయవంతం అయిన నేపధ్యంలో రాజమౌళి ప్రమోషన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అనుకోవాలి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79291/RAJAMOULI-CONNECTION-WITH-TUNGABHADRA/

0 comments:

Post a Comment

 
Top