Menu

దర్శక రత్న దాసరి నారాయణరావు 151 సినిమాలకు దర్శకత్వం వహించినా ‘సర్దార్ పాపారాయుడు’ సినిమాకు వచ్చినంత క్రేజ్ మరే సినిమాకు రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని దాసరి చూపెట్టడమే కాకుండా నందమూరి తారకరామారావులోని సామాజిక చైతన్యాన్ని మరింత ఉసిగొలిపి ఆ తరువాత రోజులలో ఎన్టీఆర్ చేత తెలుగు దేశం పార్టీ స్థాపించే విషయంలో దాసరి క్రియేట్ చేసిన ‘సర్దార్ పాపారాయుడు’ పాత్ర ప్రేరణ కలిగించింది అని అంటారు.

ఇప్పుడు మళ్ళీ 35 ఏళ్ల తరువాత అదే సంఘటన మళ్ళీ పవన్ కల్యాణ్ విషయంలో రిపీట్ కాబోతోందా అని అనిపిస్తోంది. దీనికి కారణం ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం పవన్ తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ‘సర్దార్’ అన్న టైటిల్ రిజిస్టర్ చేసాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ ను పవన్ దాసరి నిర్మించబోయే సినిమా కోసమే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసాడు అని టాక్.

జరుగుతున్న పరిణామాలను బట్టి దాసరి పవన్ ల కాంబినేషన్ లో రూపొందపోతున్న సినిమా వ్యవహారాలు స్పీడ్ అందుకోవడమే కాకుండా ఈ సినిమా దాసరి పవన్ ల జాయింట్ ప్రాజెక్ట్ గా మారబోతోంది అని టాక్. పవన్ ఇప్పటికే తయారుచేసుకున్న ‘సత్యాగ్రహి’ స్క్రిప్ట్ కు మార్పులు జరిగి ఆ కథ నేటి వర్తమాన పరిస్థుతులకు ప్రతి బింబంగా మారి ‘సర్దార్’ గా మారుతోంది అని ఫిలింనగర్ టాక్.

ఇప్పటికే తయారుచేసిన ఈ సినిమా స్క్రీన్ ప్లేలో పవన్ ఆత్మీయ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్నేహ హస్తం కూడా ఉంది అనే వార్తలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మన రాష్ట్రంలో జరుగుతున్న వర్తమాన సంఘటనలను నేపధ్యంగా తీసుకుని పవన్ తన ‘జనసేన’ సిద్ధాంతాలను ఈ ‘సర్దార్’ ద్వారా తన అభిమానులలోకి అలాగే జనంలోకి తీసుకు వెళ్ళాలనే మాస్టర్ ప్లాన్ లో భాగమే దాసరి పవన్ ల కలయిక. ఇప్పటికే రిజిస్టర్ కాబడ్డ ఈ టైటిల్ ను బట్టి పవన్ దాసరిలు టాలీవుడ్ ను షేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/80093/PAVAN-BECOMING-SARDAR-FOR-DASARI-SENTIMENT/

0 comments:

Post a Comment

 
Top