Menu

నిన్న సాయంత్రం జరిగిన ‘టెంపర్’ సక్సస్ మీట్ లో జూనియర్ చేసిన వ్యాఖ్యలు కొంత మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ మీట్ కు వచ్చిన జూనియర్ మాట్లాడుతూ తాను ఎప్పుడూ తన సినిమాల కలెక్షన్స్ గురించి, రికార్డుల గురించి పట్టించుకోననీ తన అభిమానుల ముఖంలో తాను నటించిన సినిమా ద్వారా ఆనందాన్ని చూడగలిగితే చాలు అనుకుంటానని కామెంట్ చేసాడు జూనియర్.

గత మూడు సంవత్సరాలుగా తన సినిమాలు ఏ మాత్రం విజయం సాధించక పోయినా తనను అభిమానిస్తూ తనకు మానసిక ధైర్యాన్ని కలిగించిన తన అభిమానుల కోరిక తీర్చే సినిమాగా ‘టెంపర్’ మారిందని కామెంట్ చేసాడు. అయితే ఈ ఫంక్షన్ లో జూనియర్ తో పాటు మాట్లాడిన నిర్మాత బండ్ల గణేష్ కాని దర్శకుడు పూరి కాని ఈ సినిమా విజయవంతం అయింది అని చెపుతున్నారు కాని ఎంత మేరకు ఇప్పటి వరకు రికార్డులను క్రియేట్ చేసింది అన్న విషయాల పై స్పష్టతను ఇవ్వలేక పోయారు.

దీనిని బట్టి చూస్తూ ఉంటే ‘టెంపర్’ విజయవంతం అయిన విషయం ఖాయం అయినా ‘టెంపర్’ రికార్డుల పై వస్తున్న వార్తలు అంత నిజం కాదేమో అన్న అనుమానం మరింత కలుగుతోంది అని ఆ సక్సస్ మీట్ కు వచ్చిన కొందరు కామెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయాను సారం ‘టెంపర్’ కలెక్షన్స్ హవా 50 కోట్లు దాటే పరిస్థితి లేదు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదే సక్సస్ మీట్ లో పాల్గొన్న బండ్ల గణేష్ ‘టెంపర్’ విజయవంతం కాకపోతే సినిమాలు తీయడం మానేద్దాం అని అనుకున్నాను అని బహిరంగంగా చెప్పాడు అంటే ఈ ‘టెంపర్’ విడుదలకు ముందు అందర్నీ ఎంత టెన్షన్ లో పడేసిందో అర్ధం అవుతుంది.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79517/JUNIOR-COMMENTS-IN-TEMPER-SUCESS-MEET/

0 comments:

Post a Comment

 
Top