Menu

megastar-ramcharan

అభిమానులతో అప్పుడప్పుడూ ఇంటరాక్ట్‌ అవడానికి మెగాస్టార్‌ చిరంజీవి 'బ్లడ్‌ అండ్‌ ఐ డొనేషన్‌'ను వేదికగా చేసుకున్నారు గతంలో. రక్తదానం, నేత్రదానం మానవత్వంతో కూడిన కార్యక్రమాలు గనుక, వాటిని పట్ల అవగాహన పెంచడం ద్వారా ఎంతోమందికి సహాయపడవచ్చుననే సదుద్దేశ్యంతో అభిమానుల్ని ఉత్తేజితుల్ని చేసిన చిరంజీవి, అలా తన పిలుపు మేరకు రక్తదానం చేసినవారికి, నేత్రదానం కోసం ప్రయత్నించినవారికి తనను కలిసే వీలు కల్పించారు. గీతాఆర్ట్స్‌ కార్యాలయంలో అప్పుడప్పుడూ తన అభిమానుల్ని కలుసుకుంటూ, వారితో ముచ్చటించి, ఫొటోలు దిగి, తద్వారా అభిమానులకు దగ్గరగా ఉండేవారు చిరంజీవి. అదే పద్ధతిని చరణ్‌ ఫాలో అవుతున్నాడు. 

అభిమానులతో ఇంటరాక్ట్‌ అవుతూ ఉంటే, తమపై అభిమానం వారికి ఇంకా పెరుగుతుందనీ, వారిని నిర్లక్ష్యం చేయడం తగదని కొడుక్కి ఉద్బోధ చేయడంతో, తండ్రి మాట ప్రకారమే చరణ్‌, అభిమానులతో ములాఖత్‌ అవుతున్నాడట. చరణ్‌ చేసే ప్రతి సినిమాపైనా చిరంజీవి ముద్ర ఉంటోంది. అలాగే, చరణ్‌ సేవా కార్యక్రమాల్లో కూడా చిరంజీవి ముద్ర ఇకపై కనిపించనుంది. చిరంజీవి సినిమాలు చేయకపోవడం వెనుక కారణం ఇదే కావొచ్చు. కుమారుడ్ని తన డైరెక్షన్‌లో నడిపించడం అంటే అది చాలా పెద్ద బాధ్యతే. చిరంజీవి స్టార్‌ డమ్‌ అలాంటిది. తన స్టార్‌ డమ్‌ని చరణ్‌ అందుకోవడం వెనుక చిరంజీవి కష్టాన్ని ఎలా మర్చిపోగలం?


source:http://telugu.gulte.com/tmovienews/8426/Ram-charan-meets-his-fans-with-chiranjeevi-advice

0 comments:

Post a Comment

 
Top