సినిమాలకు సంబంధించి టాప్ హీరోలు దర్శకుల విషయంలో హీరోయిన్స్ విషయంలో కన్ఫ్యూజన్ లో పడటం గతంలో చూశాం. అయితే ఈసారి చెర్రీ తన లేటెస్ట్ సినిమా కోసం అమ్మ వేటలో పడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్న లేటెస్ట్ సినిమాలో రామ్ చరణ్ తల్లిగా ఎవరిని తీసుకోవాలి అన్న సందిగ్దoలో శ్రీనువైట్ల ఉన్నట్లు టాక్.
ఇప్పటికే ఈ పాత్ర కోసం రమ్య కృష్ణ, తులసీ, జీవిత పేర్లను పరిశీలించినా వీరంతా చరణ్ అమ్మగా స్క్రీన్ పై కనిపిస్తే అంత నప్పదు అన్న అభిప్రాయంలో అటు చరణ్ ఇటు శ్రీనువైట్ల ఉన్నట్లు టాక్. ఈ పరిస్థుతులలో ఈ అమ్మ పాత్ర కోసం నదియాను తీసుకుందాం అనుకుంటే ఈసినిమా బడ్జెట్ మరింత పెరిగి పోతుందని ఆలోచిస్తున్నారట.
ఈ నేపధ్యంలో మధ్య మార్గంగా ఒకనాటి హీరోయిన్ మీనాను చరణ్ తల్లి పాత్ర కోసం సంప్రదిస్తే మీనా పెద్దగా ఈ ఆఫర్ పట్ల ఆ శక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమా కథలో అధిక ప్రాముఖ్యత ఉన్న తల్లి పాత్ర కోసం ప్రస్తుతం వేట కొనసాగుతోంది అని టాక్.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎంతోమంది తెలుగు సంగీత దర్శకులు ఉన్నా చరణ్ ఏరికోరి అడగడంతో కోలీవుడ్ మ్యూజిక్ దైరెక్టర్ అనిరుథ్ ఈసినిమాకు అనుకోని ఎంట్రీ ఇచ్చినట్లుగా చరణ్ తల్లిగా కూడా ఎవ్వరూ ఊహించని అమ్మ ఈ యూనిట్ కు ఎక్కడ దొరుకుతుందో చూడాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79415/RAMCHARAN-HUNT-FOR-MOTHER/

0 comments:
Post a Comment