Menu

buniyan-ad-lo-samantha
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తున్న హీరోయిన్ సమంత. సమంత ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తుంది. ఇవి కాకుండా మరో అయిదు చిత్రాలు తన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉంటే తను ఫిల్మ్ కెరీర్ లో ఏ విధంగా అవకాశాలను చేజిక్కించుకుంటుందో, అదే విధంగా కమర్షియాల్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగేందుకు ఆఫర్స్ ని సంపాదించుకుంటుంది.

రీసెంట్ గా నేషన్ మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన చెప్పల్ కంపెనీకి తను బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుంది. ఇప్పుడు సమంత చేతికి మరో కొత్త యాడ్ వచ్చింది. మార్కెట్ లోకి కొత్తగా రాబోతున్న బనియన్ కంపెనీకి, తను రెండు సంవత్సరాల పాటు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆ కంపెనీకి, సమంతకి మధ్య చర్ఛలు ముగిసాయి.

త్వరలోనే దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ పై సమంత సైన్ చేయనుంది. అలాగే ఇందుకోసం సమంత ఏకంగా 6 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటుంది. దీనికి సంబంధించిన క్లియర్ టాక్స్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

మొత్తంగా సమంత నటిస్తున్న సినిమాలు వరుస సక్సెస్ లు కావడంతో, తనకి ఎండోర్స్ మెంట్ కూడ వెతుక్కుంటూ వస్తున్నాయంట. తను బనియన్ ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నందుకు హ్యాపీగా ఉందని సన్నిహితులతో చెప్పుకుంటుంది. దీనికి సంబంధించిన యాడ్ షూటింగ్ ఫిబ్రవరి నెలలో ఉండొచ్చని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సమాచారం.

http://www.apherald.com/Movies/ViewArticle/77568/Samantha-tollywood-tleugu-films-Samantha-news-Sama/

0 comments:

Post a Comment

 
Top