దాసరి నారాయణరావు పవన్ కళ్యాణ్ తో సినిమాను నిర్మిస్తున్నాను అని అధికారికంగా ధృవీకరించడంతో ఈ సినిమా పై వస్తున్నన్ని వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ లో మరే సినిమా పైనా రావడంలేదు అన్నది అతిశయోక్తికాదు. దాసరి నిర్మిoచబోయే సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడు అని కొందరు ఊహిస్తూ ఉంటే మరి కొందరు అప్పుడే ఈసినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక కూడా చేపట్టారు.
లేటెస్ట్ గా వినపడుతున్న వార్తల ప్రకారం దాసరి పవన్ ల సినిమాలో విలన్ గా మోహన్ బాబు నటిస్తాడని టాక్. తన గురువు దాసరి కోసం మోహన్ బాబు ఈ విలన్ అవతారం ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాడని కొందరి ఊహ. అయితే పవన్ ఎప్పటి నుంచో ప్రారంభించవలసిన ‘గబ్బర్ సింగ్2’ కు ఇంత వరకు మోక్షం కలగని నేపధ్యంలో పవన్ దాసరిల సినిమా కనీసం ఈ సంవత్సారాంతానికైనా ప్రారంభం అవుతుందా అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మరి కొందరు అయితే ఇది కేవలం పవన్ మొహమాటంతో దాసరికి ఇచ్చిన మాట అని కూడ అని అంటున్నారు.
అయితే ఎప్పుడు మొదలవుతుందో తెలియని ఈ సినిమా పై మాత్రం వెబ్ మీడియాలో ప్రశంసలు, కామెంట్లు, విశ్లేషణలు జోరుగానే జరిగి పోతున్నాయి. మరికొందరైతే మరో అడుగు ముందుకు వేసి పవన్ దాసరితో ఈ సినిమాను చేయడం ద్వారా తిరిగి చిరంజీవి దాసరిల మధ్య సయోధ్య కుదురుతుంది అనే ఊహాగానాలు కూడ చేస్తున్నారు.
పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లబోయే ముందు మరికొన్ని సినిమాలు చేస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పినా ‘గోపాల గోపాల’ సినిమా కోసమే నెలలు తరబడి కాలాన్ని గడిపేసిన పవన్ ఇప్పుడు ఈ లేటెస్ట్ సినిమాను ఎప్పుడు మొదలు పెట్టి మరెప్పుడు పూర్తి చేస్తాడో పవన్ దాసరిలకు మాత్రమే తెలియాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79796/MOHAN-BABU-ISSUE-BETWEEN-PAVAN-AND-DASARI-/

0 comments:
Post a Comment