March 15, 2025 02:21:46 AM Menu
Latest

6:28 PM test1

జూనియర్ అభిమానులే కాదు జూనియర్ వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘టెంపర్’ సినిమాకు ఎన్టీఆర్ తనకు తానే వ్యక్తిగతంగా అవరోధంగా మారుతున్నాడా? ఇప్పుడు ఇవే గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు సంబంధించి జూనియర్ ఇంకా రెండు రీల్స్ కు డబ్బింగ్ చెప్పవలసి ఉంది అని టాక్.

అయితే ఆ పనిని ఇంకా జూనియర్ పూర్తి చేయలేదు అని అంటున్నారు. దీనికి కారణం బండ్ల గణేష్ ఈ సినిమాకు సంబంధించి జూనియర్ కు ఒప్పుకున్న పారితోషికంలో ఇంకా 3 కోట్ల వరకు ఇవ్వవలసి ఉంది అని టాక్. ఈ డబ్బు తనకు అందేవరకు జూనియర్ తన డబ్బింగ్ ను పూర్తి చేయనని నిర్మాత బండ్ల గణేష్ కు సమాచారం పంపాడని అంటున్నారు.

అయితే ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ‘టెంపర్’ సెన్సార్ పూర్తి కాలేదు అన్నది వాస్తవం. అందువల్లనే ఈరోజు ప్రముఖ పత్రికలకలలో ఈ సినిమాకు సంబంధించి వచ్చిన వార్తలలో ఈ వారం విడుదల అని ప్రకటన మాత్రమే ఉంది కాని ఇప్పటికీ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించలేదు.

దీనిని బట్టి చూస్తూ ఉంటే వినపడుతున్న వార్తలు కొంత వరకు నిజమా అనే అనుమానం కలుగుతోంది. అయితే ఈ సినిమా విడుదల జూనియర్ కెరియర్ కు కూడా చాల ముఖ్యం కాబట్టి ఏదోవిధంగా ఈ విషయంలో అటు జూనియర్ ఇటు బండ్ల గణేష్ లు ఒక పరిష్కారానికి వచ్చి తీరుతారు అనే మాటలు వినిపిస్తున్నాయి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78224/JUNIOR-BECOMING-TROUBLE-TO-TEMPER-/
08 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top