Menu

తెలుగు తెర జక్కన్నగా పేరు పొందిన రాజమౌళి మళ్ళీ తన పేరును సార్ధకం చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటిదాకా ‘బాహుబలి’ విడుదల పై ఉన్న అంచనాలు తారుమారు అవుతాయా అనే గాసిప్పులు గట్టిగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ లో లేటెస్ట్ గా వినపడుతున్న వార్తల ప్రకారం ‘బాహుబలి’ విడుదల రాజమౌళి ఇప్పటికే ప్రకటించిన ఏప్రియల్ 17న విడుదల కాకపోవచ్చు అనే అనుమానాలు చాల గట్టిగా వినపడుతున్నాయి.

దీనికి ప్రధాన కారణo ఈసినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు ఏప్రియల్ చివరకు కాని పూర్తి కావు అనే వార్తలు సందడి చేస్తున్నాయి. దీనితో ‘బాహుబలి’ విడుదల మే మధ్యకు కాని లేదంటే మే చివరకు కాని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.

ఈ వార్తలే నిజం అయితే సమ్మర్ లో విడుదల కాబోతున్న భారీ సినిమాల రిలీజ్ డేట్స్ లో చాల మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే నిజంగా ఈ వాయిదా వ్యూహం నిజంగా ‘బాహుబలి’ పోస్టుప్రొడక్షన్ పనులు పూర్తి కానందువల్లా లేదంటే అనేక భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా బిజినెస్ ఇంకా పూర్తి కానందువల్లనా అనే అనుమానాలు కూడా వినపడుతున్నాయి.

ఈ విషయాల పై రాజమౌళి మరి కొద్ది రోజులలో అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79632/BAHUBALI-EXPECTATIONS-CHANGED-/

0 comments:

Post a Comment

 
Top