Menu

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలకు ఏదొక సందర్భంలో వారు సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ వల్ల బాధపడటం జరుగుతంది. ప్రస్తుతం అటువంటి సందర్భంలోనే సౌత్ స్టార్ యాక్టర్ సమంత బాధపడుతుందట. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, హీరోయిన్ సమంత కొంత కాలం పాటు ట్విట్టర్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట.

ఇది తన వ్యక్తిగత నిర్ణయంగా భావిస్తుంది. ఎందుకంటే గత కొంత కాలంగా తను ట్విట్టర్ లో చేస్తున్న పోస్ట్ ల కారణంగా కొన్ని పోస్ట్ లు ఇతర అభిమానులను బాధిస్తున్నాయంట. దీంతో తను కూడ అటువంటి అభిమానుల పట్ల అసౌకర్యంగా ఉన్నట్టు భావిస్తుంది. ఇదే విషయాన్ని తను వివరిస్తూ ‘కొంత కాలం పాటు ట్విట్టర్ కు దూరంగా ఉంటున్నాను.

గాడ్ బ్లెస్ యు. అందరూ బావుండాలి' అంటూ ఆమె ట్వీట్ చేసింది. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత ఇలా చేయడంతో ఫ్యాన్స్ అప్ సెట్ అయ్యారు. పలువురు అభిమానులు రిక్వెస్ట్ చేసినా ఆమె నుండి మాత్రం ఎలాంటి రిప్లై రాలేదు.

దీంతో తను ట్విట్టర్ వీడటంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. సిద్ధార్థతో ప్రేమ వ్యవహారం తెగదెంపులు కావడమే ఇందుకు కారణమని, ఆమె చాలా అప్ సెట్ గా ఉందని, అందుకే ట్విట్టర్ కూ దూరంగా ఉండాలని నిర్ణయించుకుందనే పుకార్లు వినిపిస్తున్నాయి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79468/Samantha-tollywood-vikram-dhanush-kollywood-telguu/

0 comments:

Post a Comment

 
Top