Menu


ఇప్పటి దాక ఈ తరం హీరోలను, దేవుళ్ళను టార్గెట్ చేసిన వర్మ ఎప్పుడో 19 సంవత్సరాల క్రితం చనిపోయిన మహా నటుడు నందమూరి తారకరామారావును టార్గెట్ చేస్తూ ట్విట్స్ పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఐదు దశాబ్దాల పాటు టాలీవుడ్ ను ఏలిన నందమూరి తారకరామారావు అంటే తనకు ఎంతో గౌరవమని అయినా ఆయన మళ్ళీ పుడితే జూనియర్ వద్ద నేర్చుకోవలసిన విషియాలు ఎన్నో ఉన్నాయని కామెంట్ చేడాడు వర్మ.

దీనికి కారణం జూనియర్ నటించిన ‘టెంపర్’ అని అంటున్నాడు. ఈ సినిమాలోని జూనియర్ లుక్ ను చూస్తూ ఉంటే సీనియర్ ఎన్టీఆర్ కూడా సరిపోడు అని అనిపిస్తోందని కామెంట్ చేసాడు వర్మ. అంతేకాదు తాను సినిమా ధియేటర్లలో కూర్చుని సినిమాలు చూసే అలవాటు తనకు లేదని అయితే ‘టెంపర్’ ను మాత్రం 13వ తారీఖు తెల్లవారుఝామున 5 గంటలకు హైదరాబాద్ లోని బ్రమరాంబ ధియేటర్ లో ప్రేక్షకులతో కలిసి కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేస్తానని తెలియచేసాడు వర్మ.

అంతేకాదు ఆరోజు ఆ ధియేటర్ లో జూనియర్ అభిమానులు చేసే హంగామాను చూడటానికి నందమూరి తారకరామారావు ఆత్మ వచ్చి తన పక్కన కూర్చుంటే జూనియర్ ముందు సీనియర్ ఎంత వెనుక పడి ఉన్నాడో వివరిస్తానని చెపుతూ నందమూరికె పాఠాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు వర్మ.

ప్రస్తుతం ఈ విలక్షణ దర్శకుడు పెట్టిన ట్విట్ ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా సంచలనాన్ని కలిగిస్తున్నాయి దటీజ్ వర్మ.

source;http://www.apherald.com/MOVIES/ViewArticle/78356/VARMA-SENSATIONAL-COMMENTS-ON-NANDAMURI-TARAKARAMARAO/

0 comments:

Post a Comment

 
Top