Menu

ఇప్పటి దాకా గ్లామరస్ పాత్రలూ, గుర్రపు స్వారీలు, కత్తి యుద్దాలు చేసి మెప్పించిన అనుష్క అతి త్వరలో ఒక భక్తురాలి పాత్రలో నటించి మెప్పించ బోతోంది. దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘భగవాన్ సత్యసాయిబాబా’ సినిమాలో ఒక భక్తురాలి పాత్రను పోషించడానికి తన అంగీకారం తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.

సత్య సాయిబాబా జీవితం పై ఎంతో పరిశోధనలు జరిపి కోడి రామకృష్ణ తీస్తున్న ఈ సినిమాలో సత్యసాయిబాబా తల్లి ఈశ్వరాంబ పాత్రలో ఒకనాటి అందాల నటి జయప్రద నటించ బోతోంది. ఈ సినిమాలో భగవాన్ సత్యసాయిబాబాగా మలయాళ నటుడు దిలీప్ నటిస్తున్నాడు. తనకు తాను భగవంతుడిగా ప్రకటించుకుని తాను సమాధి అయ్యే వరకు ఎన్నో కోట్ల మంది భక్తులను ప్రభావితం చేసిన సత్యసాయిబాబా చరిత్ర ఒక అద్భుతం.

ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలలో డబ్ చేయడమే కాకుండా ఇంగ్లీష్ ఈ సినిమాను డబ్ చేసే ఆలోచనలో కోడి రామకృష్ణ ఉన్నట్లు టాక్. ఈ సినిమాలో నటించడం కోసం అనుష్క సత్యసాయిబాబా జీవితానికి సంబంధించిన పుస్తకాలను చదవడమే కాకుండా వీటితో పాటు అనేక వేదాంత గ్రంధాలను కూడా ఈ యోగా బ్యూటీ మనసు పెట్టి చదువుతోందని టాక్.

‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లు అనుష్క లోని రాజసాన్ని చూపెట్ట గలిగితే అనుష్క లోని భక్తి కోణాన్ని కోడి రామకృష్ణ ఈ ‘సత్య సాయిబాబా’ సినిమా ద్వారా మరో అనుష్క ను చూపెడతాడు అనుకోవాలి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78655/ANUSHKA-PHLOSOPHY/

0 comments:

Post a Comment

 
Top