సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు తెల్లవారుఝామున దర్శకుడు రాజమౌళితో కలిసి బ్రమరాంబ ధియేటర్ లో ‘టెంపర్’ సినిమాను చూడటమే కాకుండా ఆ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేసాడు. ఈ సినిమా షో పూర్తి అయ్యాక ఆనందం పట్టలేక ఈ సినిమా పై ముఖ్యంగా జూనియర్ పై స్పందిస్తూ ఇక రాబోయే రోజులలో జూనియర్ ఎన్టీఆర్ ను సీనియర్ ఎన్టీఆర్ గా, సీనియర్ ఎన్టీఆర్ ను జూనియర్ ఎన్టీఆర్ గా మీడియా, ప్రజలు పిలిచే రోజులు వచ్చేసాయని ట్విట్ చేసాడు.
అంతేకాదు ఈ సినిమా జూనియర్ కెరియర్ లో బెస్ట్ మూవీగా మారిపోతుందని పూరీకి ఇక తిరుగు లేదు అని అంటూ ఇద్దరినీ ఆకాశానికి ఎత్తేశాడు వర్మ. చిరంజీవి 150వ సినిమా గురించి ఇక ఆలోచన పెట్టుకోవక్కరలేదని పూరీని దర్శకుడిగా పెట్టుకుంటే చాలు చిరంజీవి 150వ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని చిరంజీవికి తన సలహాలను కూడా ఇచ్చాడు వర్మ.
జూనియర్ స్టెప్స్ ను చూస్తూ ఉంటే తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయానని జూనియర్ అభిమానులతో కలిసి స్టెప్స్ వేయాలన్న ఆనందం తనకు కలిగిందని తన భావాలను ట్విటర్ లో షేర్ చేసుకున్నాడు వర్మ. మరి వర్మ సలహా ప్రకారం జూనియర్ ను సీనియర్ ఎన్టీఆర్ గా పెలవడం మొదలు పెడితే తెలుగు దేశం పార్టీ ఫ్లక్సీలలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలకు బదులు జూనియర్ ఫోటోలను వేయాలని మరి కొద్దిరోజులు ఆగితే వర్మ ఇలాంటి సలహాలను ఇస్తాడనుకోవాలి.
యంగ్ టైగర్ కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ‘టెంపర్’ ఇచ్చినా సీనియర్ ఎన్టీఆర్ స్థాయిలో జూనియర్ ను పోలుస్తూ ఏకంగా పేరునే మార్చేయడం ప్రజలకు మాత్రం అతిగానే అనిస్తుంది.
source:Lhttp://www.apherald.com/Movies/ViewArticle/78664/VARMA-CHANGED-JUNIOR-NAME/

0 comments:
Post a Comment