నాగార్జున నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు రేటింగ్స్ పడిపోతున్నాయి అన్న భయంతో టాలీవుడ్ స్టార్స్ అందర్నీ తన షోకు అతిధులుగా పిలుస్తూ తన షో రేటింగ్స్ పెంచడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు నాగ్. ఈ షో మొదటి సిరీస్ ఆఖరి ఎపిసోడ్ కు చిరంజీవిని అతిధిగా పిలిచాడు.
ప్రస్తుతం నడుస్తున్న రెండవ సిరీస్ లో త్వరలో ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కు మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ ను అతిధిగా పిలిచి ఆ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ షూటింగ్ ను తాను బాగా ఎంజాయ్ చేసినట్లుగా రామ్ చరణ్ తన సన్నిహితుల వద్ద కామెంట్ చేసినట్లు టాక్.
అంతేకాదు తమ మెగా కుటుంబానికి సంబంధించి చాలామందికి తెలియని ఆ శక్తికర విషయాలను త్వరలో ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ లో చరణ్ నాగ్ తో పంచుకున్నట్లు ఈ షూటింగ్ చూసిన వారు అంటున్నారు. తనకు పరిశ్రమలో ఉన్న పరిచయాలతో టాప్ హీరోయిన్స్ నుండి యంగ్ హీరోయిన్స్ వరకు ఈ కార్యక్రమానికి అతిధులుగా పిలుస్తున్నాడు నాగ్.
అలాగే సానియా మీర్జా లాంటి స్పోర్ట్స్ సెలెబ్రెటీ నుండి ప్రముఖ మోడల్ శిల్పా రెడ్డి వరకు అనేక మంది సెలెబ్రెటీలతో త్వరలో ప్రసారం కానున్న నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో మంచి సందడి చేయబోతోందని టాక్. ఈ సెలిబ్రెటీల హడావిడితో అయినా నాగ్ షోకు రానున్న రోజులలో రేటింగ్స్ పెరుగుతాయేమో చూడాలి
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78359/NAGARJUNA--DEPENDENCE-ON-CHARAN/
0 comments:
Post a Comment