Menu

దర్శకత్వం వహించిన సినిమాలు సూపర్ హిట్ అయి కూడ అవకాశాల వేటలో బోయపాటి శ్రీను వెనుక పడినంత టాలీవుడ్ లో ఇప్పటివరకు మరి ఏ దర్శకుడు వెనుక పడలేదు అంటే అతిశయోక్తి కాదేమో. ‘లెజెండ్’ సూపర్ హిట్ తరువాత బోయపాటి తన కధలతో అందరి టాప్ హీరోల ఇళ్ళ చుట్టూ తిరిగిన విషయం ఎవరికైన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ మధ్య బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించబోయే రెండవ సినిమాకు దర్శకుడిగా మారడమే కాకుండా ఆ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడ చాల ఘనంగా జరిగాయి.

అయితే ఆ తరువాత బెల్లంకొండ సురేష్ ఆర్ధిక సమస్యలు వల్ల ఈ సినిమా ఆగిపోయింది అనే టాక్ ఉంది. దీనితో బోయపాటి కథ మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ తన కథలతో హీరోల చుట్టూ తిరగవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి. ఈ మధ్యంలో ఆమధ్య బోయపాటి అల్లుఅర్జున్ కు ఒక కథ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

బన్నీ ఏ నిర్ణయం చెప్పకుండా దాట వేయడంతో ఈ అవకాశం కూడా బోయపాటికి చేజారి పోయింది అనుకున్నారు అంతా. అయితే మళ్ళీ బన్నీ బోయపాటికి ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఆ కథకు ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమా స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని టాక్.

ప్రస్తుతం బన్నీ నటిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కి సంబంధించిన పనులన్నీ పూర్తి కాగానే బోయపాటి సినిమాను వచ్చే నెల చివరి వారం నుండి పట్టాలు ఎక్కిద్దామని బన్నీ ప్లాన్ అని అంటున్నారు. ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు ట్యూన్స్ కూడ కంపోజ్ చేస్తున్నాడని తెలుస్తోంది. మళ్ళీ బన్నీ అనుకోని ట్విస్ట్ ఏమి ఇవ్వకుండా ఉంటే బోయపాటి కష్టాలు గట్టెక్కినట్లే.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78739/BANNY-TWIST-TO-BOYAPATI-/

0 comments:

Post a Comment

 
Top