Menu

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ ఫుల్ గా ఉంటాయి. ఒకవేళ సక్సెస్ కాకపోయినా, వారు మాత్రం అలాగే కంటిన్యూ అవుతారు. సరిగ్గా అలాంటి కాంబినేషన్ కోసం బండ్ల గణేష్ కూడ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ నిర్మాణంలో వచ్చిన టెంపర్ మూవీ బాక్సాపీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ గా నిలిచింది.

టెంపర్ మూవీ దర్శకుడు పూరీ జగన్నాధ్ సైతం సరైన విధానంలో తెరకెక్కించడంతో ఈ మూవీని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ పూరీ జగన్నాద్ ముందు ఓ సరికొత్త ప్రపోజల్ ని పెట్టాడు.

ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఇతర భాషా సినిమాల నిర్మాతలు పోటి పడుతున్నారు. అయితే, ‘టెంపర్’ సినిమాను హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషలలో నిర్మించాలనే ఆలోచన ఉందని నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. హిందీలో సైతం పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారని చెప్పారు. మానభంగం,

అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో ఘన విజయం సాదించే సత్తా ఉందని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. అయితే బండ్ల గణేష్ ఇంతలా కామెంట్ చేస్తున్నప్పటికీ పూరీ మాత్రం చాలా కామ్ గా ఉంటున్నాడంట. పూరీకి టెంపర్ హిందీ రిమేక్ కి దర్శకుడిగా పనిచేయడం ఇష్టం లేదని, పూరీ ఆఫీస్ నుండి వినిపిస్తున్న సమాచారం.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79009/Bandla-ganesh-tollywood-telugu-films-temper-poori-/

0 comments:

Post a Comment

 
Top