Menu


‘గోపాల గోపాల’ సినిమా విడుదల అయి నేటితో నెలరోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చినా, ఆ సినిమా తీసిన నిర్మాతలు లాభాల బాట పట్టినా ఈ సినిమాను భారీ రేట్లకు కొనుక్కున్న చాలామంది బయ్యర్లు మాత్రం నష్టాల బాట పట్టారు అన్నది వాస్తవం. అయితే ఈ సినిమాను నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ కు అదేవిధం గా శరత్ మరార్ కు మంచి లాభాలు వచ్చాయి .దీనికి కారణం చాల ప్లాన్డ్ గా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించడం.

ఇప్పుడు ఈ వ్యాపార సిద్దాంతమే పవన్ కళ్యాణ్ ను ప్రభావితం చేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ శరత్ మరార్ ను నిర్మాతగా చేసి నటించబోతున్న ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకు పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం ఈ సినిమాను 20 నుంచి 25 కోట్ల లోపు పూర్తి చేసి ఆ తరువాత ఈ సినిమా బిజినెస్ వల్ల వచ్చే లాభాలలో అధిక లాభం తీసుకోవాలి అని మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు టాక్.

వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి దసరాకు రెడీ పెట్టాలని పవన్ ప్లాన్ అని అంటున్నారు. అనుకున్న విధంగా ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో నిర్మించ గలిగితే పవన్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల బిజినెస్ చేయడo ఖాయం కాబట్టి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుంటే ‘గబ్బర్ సింగ్ 2’ కు నిర్మాతలకు అదేవిధంగా బయ్యర్లకు రూపాయికి రూపాయి లాభం వస్తుందనే ఆలోచన పవన్ చేత ఈ మాస్టర్ ప్లాన్ ను వేయిస్తోందని టాక్.

దీనికోసమే ఈ సినిమాలో నటించే హీరోయిన్ దగ్గర నుంచి టెక్నిషియన్స్ వరకు వారికిచ్చే పారితోషికాలలో ఎక్కువ ఖర్చు లేకుండా వ్యూహాత్మకంగా పవన్, శరత్ మరార్ లు వ్యవహరిస్తున్నారు అని ఫిలింనగర్ టాక్.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78351/PAVAN-KALYAN-MEGA-SKECH-BECOMES-HOT-TOPIC/

0 comments:

Post a Comment

 
Top