‘టెంపర్’ విజయం తరువాత ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన
ఇంటర్వ్యూలో జూనియర్ తన తల్లి షాలిని తన పట్ల ప్రవర్తించిన విచిత్రమైన
తీరును వివరించాడు. జూనియర్ ‘టెంపర్’ సినిమాను తన తల్లి తండ్రులతో కలిసి
చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ వచ్చేదాకా తన తల్లి తనతో ఏమి మాట్లాడకుండా కనీసం
ఆమె ముఖంలో నవ్వు కూడా లేకుండా ముభావంగా ‘టెంపర్’ సినిమాను చూడటం తనకు
ఆశ్చర్యం కలిగించింది అని అంటున్నాడు.
ఇంటర్వెల్ లో స్నాక్స్ తమ వద్దకు వచ్చినా ఆమె మౌనంగా ఉండటం చూసి అందరకు నచ్చిన ‘టెంపర్’ తన తల్లికి నచ్చలేదా అని ఫీల్ అయ్యానని కామెంట్ చేసాడు జూనియర్. అయితే సెకండ్ ఆఫ్ ప్రారంభమై తన ‘టెంపర్’ సినిమాలోని క్యారెక్టర్ మంచి వాడిగా మారిపోయిన దగ్గర నుంచి తన తల్లి ముఖంలో నవ్వును చూశానని అంటూ సినిమా పూర్తి అయిన తరువాత నెగిటివ్ క్యారెక్టర్లతో ఉన్న సినిమాలను తనను చేయవద్దు అంటూ తన తల్లి సలహా ఇచ్చిందని చెప్పాడు జూనియర్.
అయితే తనకు నెగిటివ్ పాజిటివ్ అన్న ఫీలింగ్స్ ఉండవని తన తల్లితో చెపితే తాను నటించిన అటువంటి సినిమాలను తాను చూడను అని అంటూ తనకు తన తల్లి షాక్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు జూనియర్.
తన తండ్రి హరికృష్ణ మాత్రం సినిమా పూర్తి అయిన తరువాత తనను కౌగలించుకుని ఏడుస్తూ తనకు పెద్ద కొడుకు దూరం అయ్యాడు అన్న బాధ ఈ సంవత్సరంలో తన కొడుకుల విజయాలతో మరిచి పోతున్నానని కన్నీటితో చెప్పడం తనను కలిచి వేసిందని అన్నాడు జూనియర్.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/79053/JUNIOR-GOT-SHOCKED-WITH-HIS-MOTHER-SENTIMENT/

0 comments:
Post a Comment