హీరో నాగచైతన్యను టాలీవుడ్ సినిమా రంగంలో చాలామంది ‘చై’ అని ముద్దుగా
పిలుస్తూ ఉంటారు. చైతు అన్న మాటకు మరింత షార్ట్ చేసి ఈ ‘చై’ ముద్దు పేరు
చైతన్యకు ఏర్పడింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ నే ఆధారంగా చేసుకుని నాగ చైతన్య
సుదీర్ వర్మ దర్శకత్వంలో లేటెస్ట్ గా నటిస్తున్న సినిమాకు ‘దోచేయ్’ పేరును
నిన్న అధికారికంగా మహా శివరాత్రి రోజున ప్రకటించారు.
కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కథ ఒక క్రైం కామెడీ. ఒక వెరైటీ సినిమాగా ఉంటుంది అని ముచ్చట పడి చైతన్య ఈసినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ‘అత్తారింటికి దారేది’ తీసిన ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను సమ్మర్ రేసులో నిలపాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్.
ఇప్పటికే పాటలు మినహా మిగతా చిత్రీకరణ అంతా ఈ సినిమా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా అవుట్ పుట్ ను ఈ మధ్య చూసిన నాగార్జున ఈ సినిమా కథలో చాల మార్పులు చేర్పులు సూచించినట్లు టాక్.
దీనితో షాక్ కు గురైన సుదీర్ వర్మ నాగ్ చెప్పిన మార్పులు ప్రకారం ఈసినిమాను మళ్ళీ రీ షూట్ చేయాలా లేదంటే సమ్మర్ రిలీజ్ కు రెడీ పెట్టాలా అన్న విషయమై తర్జన భర్జనలు పడుతున్నారని ఫిలింనగర్ టాక్.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79060/CHAITANYA-CHAI-SENTIMENT/

0 comments:
Post a Comment