టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డెబ్యూ హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం
అవుతున్న హీరో అక్కినేని అఖిల్. అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు
చూస్తున్న ఈ యంగ్ హీరో, ప్రస్తుతం తన డెబ్యూ మూవీకి సంబంధించిన షూటింగ్ లో
బిజిగా ఉన్నాడు. అఖిల్ ని పరిచయం చేస్తున్న వివి వినాయక్, ఈ సినిమాకి
సంబందించిన షూటింగ్ ని త్వరగా పూర్తి చేసేందుకు అన్ని షెడ్యూల్స్ ని
పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అఖిల్ అంటున్నాడు. అంతే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ లో అఖిల్ చాలా రిస్కీ షాట్స్ ని ఎటువంటి డూప్ లేకుండా చేస్తున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. తను తాజగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
‘నా మొదటి సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని, వాటిని మీ అందరికీ అమితంగా నచ్చేలా డిజైన్ చేస్తున్నామని’ తెలిపాడు. అయితే తను చేసే యాక్షన్ ఎపిసోడ్స్ లో దర్శకుడు వినాయక్ డూప్ ని సజెస్ట్ చేయగా, అఖిల్ మాత్రం చిన్న వాటికి కూడ వద్దని అంటున్నాడంట. దీంతో దర్శకుడి మాట విననకుండా అఖిల్ చేస్తున్న స్టంట్స్ అందర్నీ భయపెడుతున్నాయని చిత్రయూనిట్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అఖిల్ లాంచ్ వేడుకలో నాగార్జున కూడా అఖిల్ సినిమాలో రొమాన్స్ కంటే ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని తెలిపాడు.
అలాగే మాస్ పల్స్ తెలిసిన వినాయక్ దర్శకుడు కావడంతో ఈ సినిమా పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని అంటున్నారు. ఈ మూవీలో అఖిల్ సరసన సయేశా సైగల్ జోడీ కట్టనుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని హైదరబాద్ ఓల్డ్ సిటీలో మొదలు పెట్టి అఖిల్ పై ఇంట్రడక్షన్ ఫైట్ ని షూట్ చెయ్యనున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79018/AKKINENI-AKHIL-NITHIN-VINAYAK-AKHIL-AKKINENI-FILMS/

0 comments:
Post a Comment