Menu


కమెడియన్ అలీ సినిమాలలో నటిస్తూనే బుల్లి తెర‌ పై చాల షోలు చేస్తూ సినిమాలకన్నా ఎక్కువగా సంపాదిస్తాడు అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఈ కమెడియన్ తాను పాల్గొనే ఆడియో వేడుకల నుండి బుల్లితెర షోల వరకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆ కార్యక్రమాలలో పాల్గొనే హీరోయిన్స్ పై సెటైర్లు, బూతు జోకులు వేయడం అలీకి అలవాటుగా మారింది. ఈ జోకులు ఒకొక్కసారి మరీ మితిమీరి ఉంటున్నాయి అనే మాటలు కూడా ఉన్నాయి.

అయితే తెలుగు సరిగ్గా రాని హీరోయిన్స్ మాత్రం అలీ వేసే సెటైర్లకు భాష అర్ధం కాకపోవడంతో చాలామంది ఆ జోక్స్ ను ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. లేటెస్ట్ గా ఇటువంటి విషయమై ఒకటి జరిగింది. ఈ మధ్య దుబాయ్ లో జరిగిన ‘గామా’ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అలీ ఒక హీరోయిన్ పై వేసిన సెటైర్ మరీ మొరటుగా ఉందని ఆ కార్యక్రమానికి వచ్చిన వారే కామెంట్ చేసుకున్నారు అనే వార్తలు విని పిస్తున్నాయి.

ఇక వివరాలలోకి వెళితే అల్లుఅర్జున్ తో హీరోయిన్ గా ‘బన్నీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గౌరీ ముంజ‌ల్‌ ను అలీ తన బూతు సెటైర్లతో టార్గెట్ చేసాడు అని టాక్. అంతేకాదు అలీ ఆమెతో చేసిన ఓవర్ యాక్షన్ కొంతమందికి ఆశ్చర్యం కలిగించింది అని అంటున్నారు. ఈ అవార్డ్స్ కార్యక్రమంలో స్పెషల్ డాన్స్ చేసిన గౌరీ ముంజల్ తన డాన్స్ తో ఆ కార్యక్రమానికి హైలెట్ గా నిలిచింది.

ఆ తరువాత వేదిక పైకి వచ్చిన అలీ ఈ హీరోయిన్ గురించి కామెంట్ చేస్తూ ‘బ‌న్నీ సినిమాలో లేత తాటిముంజెలా ఉండేది. ఇప్పుడు తాటికాయ‌లా త‌యారైంది’ అని సెటైర్లు వేసినట్లు టాక్. ఈ సెటైర్లు విన్న ఆ కార్యక్రమంలోని ప్రేక్షకులు ఒక్క క్షణం ఆశ్చర్య పడితే తెలుగు భాష రాని గౌరీ ముంజల్ అలీ అన్న మాటలకు అర్ధం తెలియక తెగ నవ్వుకుందని టాక్.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78354/ALI--ADULT-JOKES-BECOMES-HOT-TOPIC/

0 comments:

Post a Comment

 
Top