Menu


స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అల్లుఅర్జున్ నటనను, డాన్స్ ను అందరి హీరోల అభిమానులు ఆదరిస్తారు. అందువల్లనే బన్నీది డిఫరెంట్ స్టైల్. అయితే ఈ అల్లువారి అబ్బాయికి తన షర్ట్ విప్పి నటించడం పై చాల బోర్ కొట్టింది అని అంటున్నాడు.

అసలు టాలీవుడ్ లో షర్టులు తీసి హీరోలు తమ బాడీలను చూపెట్టే పద్ధతికి గతంలో తాను నటించిన ‘దేశముదురు’ సినిమా ద్వారా మొదటలు పెట్టి ‘బద్రీనాథ్’ సినిమా వరకు కొనసాగించిన అల్లుఅర్జున్ కు ఇక షర్ట్ విప్పడం పై బోర్ ఏర్పడటమే కాకుండా భవిష్యత్ లో తాను నటించే ఏ సినిమాలోను షర్టులు విప్పి సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ అవతారాలను చూపించనని బహిరంగంగా చెపుతున్నాడు బన్నీ.

అంతేకాదు ఇక తనలో కొత్తగా ఏముంది చూపించడానికి అని అంటూ తన పై తానే సెటైర్లు వేసుకుంటున్నాడు. మరోక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక భవిష్యత్ లో స్ప్రింగ్ లా డాన్స్ లు చేసే పద్ధతిని కూడా మార్చుకుంటానని ఇటువంటి స్టెప్స్ తో కూడిన పాటలు తన సినిమాలలో ఒకటి తప్పితే రెండు మించి ఉండవని చెపుతున్నాడు.

ఇక హై వొల్టేజ్ సినిమాలను కూడా తాను తగ్గించుకుని మంచి వాడిగా మారిపోతాను అని అంటున్నాడు బన్నీ. అయితే బన్నీ తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్ లో బన్నీ సినిమాలు అభిమానులు ఆదరిస్తారా అన్నదే ప్రశ్న.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78313/BANNY-GETTING-BORED-OF-TAKING-HIS-SHIRT/

0 comments:

Post a Comment

 
Top