Menu

sanjana-drinking-kallu

పార్టీస్ లో హీరోయిన్స్ తాగడం అనే విషయం సర్వసాదారణంగా మారింది. రీసెంట్ గా అంజలి చేసిన అల్లరి మరువక ముందే ఇంకో హీరోయిన్ తాగుతూ కనిపించింది. పూరిజగన్నాథ్ 'బుజ్జిగాడు' సినిమాలో త్రిష చెల్లెలి పాత్రలో ఓకే అనిపించుకున్న నటి సంజన. ఆ తరువాత తెలుగులో చెప్పుకోదగ్గ హిట్స్ లేని ఈ సుందరి కన్నడ ఇండస్ట్రీని నమ్ముకుంది. ఇప్పుడు కన్నడలో టాప్ హీరోయిన్స్ కి ఎవరికీ ఇవ్వలేనంత పారితోషికం అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ కల్లు తాగుతూ కనిపించింది. మరి సరదా కోసం చేసిందో లేదా రోజు తాగే అలవాటు ఉందో తెలియదు కాని మొత్తానికి ఇలా తాగుతూ కనిపించింది. సంజన అనే పేరుతో కలిసి రావట్లేదని తన పేరులో మరొక అక్షరం చేర్చుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో రవిబాబు చేస్తున్న 'అవును 2' సినిమాలో ఓ పాత్రలో నటిస్తుంది.

source:http://www.cinejosh.com/news-in-telugu/4/22769/heroine-sanjana-bujjigaadu-ravibabu-avunu2.html

0 comments:

Post a Comment

 
Top