ఆగడు’ పరాజయం తరువాత తమన్నా పేరు చెపితే టాలీవుడ్ హీరోలు అంతా భయ పడిపోతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఆమెకు టాలీవుడ్ లో ఒక్క ‘బాహుబలి’ తప్పించి మరే పెద్ద సినిమా చేతిలో లేదు. అయితే అనుకోకుండా రవితేజా చేసిన సహాయం తమన్నాను మంచి జోష్ లో ముంచేసింది. మాస్ మహారాజాతో తమన్నా నటిస్తున్న ‘బెంగాల్ టైగర్’ ప్రారంభోత్సవం నిన్న భాగ్యనగరంలో జరిగింది.
ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడిన తమన్నా రవితేజాను ఆకాశానికి ఎత్తేస్తూ టాలీవుడ్ లోని హీరోలలో రవితేజా పేరు వింటే అతడి పక్కన నటించే వారికి కూడా ఎనర్జీ వస్తుందని అంటూ రవితేజాను రియల్ టైగర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తి వేసింది.
తనకు ఎప్పటి నుంచో రావితేజాతో నటించాలని ఉన్న కోరిక ఈరోజు నెరవేరింది అని ఆమె అతి పొగడ్తలు మీడియా వారికి కూడా అతిగా అనిపించాయి అని టాక్. అవకాశాలు లేని పరిస్థుతులలో పిలిచి మరీ తనకు అవకాశం ఇచ్చినందుకు మిల్కీ బ్యూటీ ఆ మాత్రం ఋణం తీర్చుకోవాలని ఆమె మాటలు విన్న ఎవరికైనా అనిపిస్తుంది.
ఒక వైపు రెండు సంవత్సరాల నిరీక్షణ తరువాత తిరిగి మెగా ఫోన్ పట్టుకున్న సంపత్ నందికీ అవకాశాలే కరువైన తమన్నాకు రవితేజా ఇచ్చిన స్నేహ హస్తం తిరిగి వారి కెరియర్ ను ఎంత వరకూ ఈ ‘బెంగాల్ టైగర్’ మారుస్తుందో చూడాలి.
sourcr:http://www.apherald.com/Movies/ViewArticle/77555/TAMANNAH-SENSATIONAL-COMMENTS-ON-RAVITEJA/

0 comments:
Post a Comment