Menu

rajamouli-bahubali
సూపర్‌స్టార్స్‌లో ఏ ఒక్కరికీ తీసిపోని ఇమేజ్‌, బ్రాండ్‌ వేల్యూ రాజమౌళికి ఉందంటే అతిశయోక్తి కాదు. అతని సినిమాలో హీరో ఎవరనేది తెలియకపోయినా, అసలు తన చిత్రానికి ఒక పేరంటూ లేకపోయినా... 'రాజమౌళి చిత్రం' అని రిలీజ్‌ చేస్తే చాలు జనం ఎగబడిపోతారు. అంతగా తన ముద్రని తెలుగు సినిమా ప్రేక్షకులపై వేసిన రాజమౌళి తన రేంజ్‌ ఏంటనేది ఇంకోసారి చూపించాడు. 

వెండితెరపై కాదు... ట్విట్టర్‌లో! సాధారణంగా సూపర్‌స్టార్స్‌కి, వివిధ భాషల్లో తెలిసిన నటీనటులకి మాత్రం పది లక్షల మంది ఫాలోవర్స్‌ ఉంటారు. కానీ రాజమౌళి ట్విట్టర్‌లో వన్‌ మిలియన్‌ ఫాలోవర్స్‌ని సాధించుకుని తన స్టార్‌డమ్‌ ఇంకోసారి చూపించాడు. ఎంత బిజీగా ఉన్నా కానీ తను చూసిన సినిమాలపై, ట్రెయిలర్స్‌పై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే రాజమౌళి ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమాని అద్భుతంగా తీయడమే కాదు... దానిని మార్కెట్‌ చేయడంలో కూడా రాజమౌళి ఎప్పుడూ వెనుక ఉండడు. 

source:http://telugu.gulte.com/tmovienews/8404/Rajamouli-joins-1-Million-club-on-Twitter

0 comments:

Post a Comment

 
Top