గోవా బ్యూటీ ఇలియానాకు అల్లుఅర్జున్ సహాయ పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ పై కోపంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయి అక్కడ అనేక ప్రయత్నాలు చేసినా ఇలియానాకు కలిసి రాలేదు. దీనితో ప్రస్తుతం చేతిలో సినిమాలు లేని ఇలియానా మళ్ళీ దక్షిణాది సినిమా రంగం వైపు చూస్తోంది. టాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపించక పోవడంతో కనీసం కోలీవుడ్ లో అయినా తన హవా చాటుదామని ఇలియానా తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
అయితే అక్కడ అనుకోకుండా ఆమెకు అదృష్టం తలుపు తట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ హీరో ప్రశాంత్ తండ్రి నిర్మాత త్యాగరాజన్ నిర్మిస్తున్న ‘సాహసం’ సినిమాలో ఇలీ బేబికి పిలిచి అవకాశం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమా గతంలో ఇలియానా అల్లుఅర్జున్ తో నటించిన ‘జులాయి’ సినిమాకు రీమేక్.
ఈ పాత్రకు ఇలియానా తప్ప మరి ఏ హీరోయిన్ బాగుండదు అని నిర్మాతలు భావించడంతో ఇలియానాకు మళ్ళీ ఈ అవకాశం వచ్చింది అని అంటున్నారు.
ఎలాగు నెమ్మదిగా చెన్నై చేరుకుంది కాబట్టి నెమ్మదిగా తన తప్పును తెలుసుకుని తిరిగి తనకు ఉన్న పరిచయాలతో తెలుగు సినిమాలలో నటించే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏమైనా ఈ విపత్కర పరిస్థుతులలో ఇలియానాకు సహాయం చేసిన హీరోగా బన్నీ గుర్తుండిపోతాడు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/77279/BANNY-HELP-TO-ILIYANA/

0 comments:
Post a Comment