దీంతో బాహుబలి తరువాత ప్రభాస్ చేయబోయే సినిమా గురించి అందరిలోని ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రభాస్ కి సంబంధించిన ఓ ఆసక్తి కరమైన టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రభాస్ బాహుబలి తరువాత నటించబోతున్న రెండు మూవీలకి సంబంధించిన రెమ్యునరేషన్ దాదాపు 50 కోట్ల రూపాయలుగా సమాచారం తెలుస్తుంది.
తను చేయబోతున్న ఆ రెండు మూవీల వివరాలను చూస్తే, బాహుబలి తరువాత అందరిని ఆశ్చర్య పరుస్తూ ప్రభాస్ ఒక యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు. రన్ రాజ రన్ వంటి సూపర్ హిట్ సినిమా కి దర్శకుడు సుజీత్ ఈ సినిమా కి దర్శకుడు.
U V క్రియేషన్స్ బ్యానర్ పై వంశి – ప్రమోద్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా విభిన్నంగా ఉంటుందని సినీ యూనిట్ తెలిపింది. ఈ సినిమాతోపాటు దర్శకుడు దశరథ్‌తో మరో చిత్రాన్ని చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రభాస్‌కు మిస్టర్ ఫర్‌ఫెక్ట్ వంటి హిట్ చిత్రాన్ని అందించిన దశరథ్ చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ఓకే తెలిసాడు. తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79262/BAAHUBALI-BAAHUBALI-1ST-PRAT-TOLLYWOOD-RAJAMOULI-R/
0 comments:
Post a Comment