ఆమధ్యన తెలుగు సినిమా రంగం పై కోపం వచ్చి టాలీవుడ్ కు దూరంగా జరిగిపోయి కోలీవుడ్ లో తన హవా చాటుకుందామని పలు ప్రయత్నాలు చేసి అక్కడ అవకాశాలు కలిసి రాక పోవడంతో తిరిగి యూటర్న్ తీసుకుని తనకు హిట్ పెయిర్ గా మారిన రామ్ చరణ్ తో గత సంవత్సరం ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో తిరిగి టాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది కాజల్. ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించక పోయినా తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించు కుంది కాజల్.
ఇక అతి త్వరలో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాలో కూడా కాజల్ స్కిన్ షో ఎక్కువగానే ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈమధ్య ఒక మీడియా ఇంటర్వ్యూలో కాజల్ చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి. తాను కెరియర్ ప్రారంభం నుండి చాల పద్దతిగా వ్యవహరిస్తూ వచ్చానని అంతేకాకుండా చాలామంది హీరోయిన్స్ లా తాను ఎవరితోనూ ఎఫైర్స్ నడపలేదని అందువల్లనే తన వ్యక్తిత్వం గురించి ఏ మీడియా వర్గం వారు కూడా తన పై నెగిటివ్ కామెంట్స్ రాయలేదని తన గొప్ప తనాన్ని తానే పెంచుకుని చెప్పుకుంది కాజల్.
అయితే గతంలో ఒక టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమ వ్యవహారంలో ఈమె దెబ్బ తినడంతో టాలీవుడ్ పై కోపం వచ్చి దూరంగా వెళ్ళి పోయింది అనే వార్తలు గతంలో వచ్చాయి. ఈ వార్తలను అప్పట్లో కాజల్ ఖండించింది. అయితే ఆ తరువాత టాలీవుడ్ కు దూరమై తిరిగి మళ్ళీ దగ్గరవుతోంది.
ఇలాంటి పరిస్థుతులలో ఎవరూ అడగకుండానే తాను ఎటువంటి ఎఫైర్స్ కు సంబంధించి వార్తలలో ఉండను అంటూ గడిచిపోయిన వ్యవహారాలకు సంబంధించిన వార్తలను మళ్ళీ తానంతట తానే ఎందుకు కెలుక్కుంటోoది అంటూ ఆమె పై ఫిలింనగర్ లో సెటైర్లు పడుతున్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/77313/KAJAL-WORDS-GOT-SCOCKED/

0 comments:
Post a Comment