Menu

srinu-vytla-again-with-kona-venkat

సినీ పరిశ్రమలో సక్సెస్‌కు మాత్రమే వాల్యూ ఉంటుంది. ఆ సక్సెస్‌ అనేది ఎప్పుడూ వెంటే ఉండాలి. ఒక్కసారి ట్రాక్‌ తప్పినా.. వాల్యూ పడిపోతుంది. ఇప్పుడు శ్రీను వైట్ల పరిస్థితి అలాగే ఉంది. మొన్నటిదాకా నేను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరించిన వైట్ల.. 'ఆగడు' ఫ్లాప్‌ పుణ్యమా అని ఇగోస్‌ అని పక్కనబెట్టక తప్పని పరిస్థితి. చివరికి తనకు తీవ్ర విభేదాలున్న కోన వెంకట్‌తో మళ్లీ జట్టు కట్టక తప్పలేదు అతనికి. 'ఆగడు' విడుదలయ్యాక ఆరు నెలల పాటు మెగా కాంపౌండ్‌లో రౌండ్లు కొట్టి కొట్టి చివరికి ఓ స్క్రిప్టు ఫైనలైజ్‌ చేస్తే సడెన్‌గా కోన ఆ స్క్రిప్టులో వేలు పెడుతున్నాడన్నది తాజా సమాచారం.

చిరంజీవి సూచన మేరకు వైట్లతో మళ్లీ జట్టు కట్టేందుకు ఓకే అన్న కోన వెంకట్‌.. శ్రీను వైట్ల అండ్‌ కో తయారు చేసిన స్క్రిప్టును ఓసారి పరిశీలించాడట. ఐతే సెకండాఫ్‌ అంత సంతృప్తికరంగా లేదని పెదవి విరిచాడట. ఇది చూసి శ్రీను వైట్లకు మండిపోయిందట. అయినా తన పరిస్థితి ఇప్పుడేమంత బాలేదు కాబట్టి.. కోనతో సర్దుకుపోతున్నాడట. స్క్రిప్టులో మార్పులు చేయడానికి ఓకే అన్నాడట. ఈ ప్రాసెస్‌ ఇంకొన్నాళ్లు కొనసాగి.. చరణ్‌ సినిమా ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక్క ఫ్లాప్‌ శ్రీను వైట్లను ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చేసిందో చూశారా? 


source:http://telugu.gulte.com/tmovienews/8418/Kona-Venkat-hand-in-Srinu-Vaitla-Script

0 comments:

Post a Comment

 
Top