Menu


రభస ఫలితం పై జూనియర్ ఎలాఉన్నా సమంత మాత్రం చాలా భాధ పడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. మొన్న విడుదల అయిన ఈ సినిమాకు సంబంధించి వచ్చిన సమీక్షల్లో తనపై వచ్చిన కామెంట్లు సమంత కు షాకింగ్ గా మారాయి అని టాక్. తాను  ప్రతి సినిమాలోను బాగా చేయడానికే ప్రయత్నించినా తనను కావాలని టార్గెట్ చేస్తూ వస్తున్న కామెంట్లు తనను భాద పెడుతున్నాయని సమంత తన సన్నిహితుల దగ్గర గగ్గోలు పెడుతోందని మీడియా న్యూస్.

 ‘అల్లుడు శీను’ ‘సికిందర్’ సినిమాలలో తాను మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేసానని గగ్గోలు పెట్టిన మీడియా రభస సినిమాలో తను సరిగా నటించ లేదని కామెంట్స్ రాయడమే కాకుండా సమంతకు రెండు వారాలు గడవకుండానే ఒకే నెలలో రెండు షాక్ లు అని వస్తున్న మీడియా రాతలు ఈ మాయలేడిని కుంగ తీస్తునాయట. 

డైరెక్టర్ సూచనల ప్రకారం తన పాత్ర ఎలా ఉంటే అలా నటించగలను కాని అన్ని సినిమాలలోను ఏమాయచేసావె, మనం లాంటి వెరైటీ క్యారెక్టర్లే కావలి అంటే అవి దొరకాలి కదా అని సమంత మధన పడుతుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.   ఈ వార్తలు ఇలా ఉండగా మొన్న విడుదల అయిన రభస సినిమా ప్రమోషన్ కార్య క్రమాలలో అటు జూనియర్ ఇటు సమంత లు కనిపించ కుండా కేవలం దర్శకుడు శ్రీనివాస్ మాత్రమే కనిపించడం బట్టి జూనియర్ సమంతలకు తాము నటించిన రభస తమకే నచ్చలేదా అనే మాటలు వినిపిస్తున్నాయి.

0 comments:

Post a Comment

 
Top