సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘ఆగడు’ సినిమా ఆడియో ఆగష్టు 30వ తేదీన అభిమానుల సమక్షంలో రిలీజ్ చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెరీర్లో 50వ సినిమాగా వచ్చిన ఈ సినిమా ఆడియోకి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో విడుదలైన మరుసటి రోజు మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘నా ప్రాణమైన గౌతమ్ 8వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. తనకి విషెస్ చెప్పిన అందరికీ ధన్యవాదాలు. గౌతమ్ ప్రస్తుతం ఆగడు సాంగ్స్ ని కంటిన్యూగా వింటున్నాడు. గౌతమ్ కి నచ్చిన పాట భేల్ పూరి. మంచి ఆల్బమ్ ఇచ్చినందుకు థాంక్స్ తమన్’ అని మహేష్ ట్వీట్ వేసాడు.
మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఆగడు’కి శ్రీనువైట్ల డైరెక్టర్. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
0 comments:
Post a Comment