Menu


అనుకున్న పధకం ప్రకారం టార్గెట్ చేస్తున్నారో లేదంటే యాదృచ్చికంగా జరుగుతోందో తెలియక పోయినా టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల కలెక్షన్స్ కు బెంగుళూర్ లో కన్నడ సూపర్ స్టార్స్ సినిమాలు శాపంగా మారుతున్నాయి. మన క్రేజీ టాప్ యంగ్ హీరోల సినిమాలకు బెంగుళూరులో కూడ భారీ ఓపినింగ్స్ వస్తు ఉంటాయి. దీనికి కారణం మన హీరోల అభిమానులు అక్కడ కూడ ఉండటమే కాకుండా మన తెలుగు వారు కర్నాటక ప్రాంతంలో చాలామంది ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే గత వారం విడుదలైన జూనియర్ ‘రభస’ కు ముందురోజు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార్ నటించిన ‘పవర్’ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మహేష్ నటించిన ‘దూకుడు’ కు ఇది కన్నడ రీమేక్ అన్న విషయం తెలిసిందే. దీనితో జూనియర్ కు బెంగుళూర్లో బాగా అభిమానులు ఉన్నా పునీత్ రాజ్ కుమార్ పవర్ ముందు జూనియర్ తేలిపోయాడు.

అదేవిధంగా మహేష్ బాబు నటిస్తున్న ‘ఆగడు’ విడుదల అవుతున్న సెప్టెంబర్ 19వ తారీఖుకు ఒకరోజు ముందు సెప్టెంబర్ 18న మరో కన్నడ టాప్ హీరో ఉపేంద్ర నటించిన ‘సూపర్ రంగా’ విడుదల కావడం ‘ఆగడు’ నిర్మాతలను భయ పెడుతోంది అని టాక్. ఇది చాలదు అన్నట్లుగా రామ్ చరణ్ కు కూడ కన్నడ టాప్ హీరోల నుండి సమస్య ఎదురౌతోంది. అక్టోబర్ 1న విడుదల కాబోతున్న చరణ్ ‘గోవిందుడు’ సినిమాకు పోటీగా కన్నడ టాప్ హీరో దర్శన్ నటించిన ‘అంబరీష’ సినిమా విడుదల అవుతూ ఉండటంతో మన క్రేజీ యంగ్ హీరోల సినిమాలకు కన్నడ సూపర్ స్టార్స్ సినిమాలు అడ్డుగా రావడమే కాకుండా మన టాప్ హీరోల సినిమాలను కర్ణాటక ప్రాంతానికి కొనుకున్న బయ్యర్లకు షాకింగ్ గా మారాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

0 comments:

Post a Comment

 
Top