Menu



రభస” అనే టైటిల్ ఏ క్షణాన్న జూనియర్ ఎంచుకున్నాడో తెలియదు కాని యంగ్ టైగర్ కు ఈ సినిమా పెట్టినన్ని కష్టాలు మరే సినిమా గతంలో పెట్టి ఉండదు. కలెక్షన్స్ ‘రభస’ జరుగుతుంది అనుకుంటే పరాజయాల ‘రభస’ జూనియర్ కు షాక్ ఇస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే 55 కోట్ల బిజినెస్ జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే ఇంత బిజినెస్ జరిగినా ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ సినిమాలో నటించిన కొంతమంది నటీనటులతో పాటు మరి కొంతమంది టెక్నీషియన్స్ కు ఇప్పటికీ పూర్తి రెమ్యునరేషన్స్ క్లియర్ చేయలేదు అనే వార్తల హడావిడి ఫిలింనగర్ లో వినిపిస్తోంది.

మరొక షాకింగ్ న్యూస్ ఏమిటంటే పూర్తిగా పారితోషికం అందని నటీనటుల జాబితాలో జూనియర్ కూడ ఉన్నాడు అని వినిపిస్తున్న గాసిప్పులు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. పారితోషిక విషంలో బెల్లంకొండను అడుగుతున్న టెక్నిషియన్స్ కు కొంతమంది నటీనటులకు బెల్లంకొండ ఇస్తున్న సమాధానాలు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయని ఫిలింనగర్ టాక్. ఇది ఇలా ఉండగా మొదటిరోజు కలెక్షన్స్ విషయంలో సుమారు 9 కోట్లు వసూలు చేసిన ‘రభస’ తరువాత రెండవ రోజు, మూడవ రోజు కలెక్షన్స్ విషయంలో విపరీతమైన డ్రాప్ ఉంది అని ఫిలింనగర్ టాక్. ఈవారం రవితేజ ‘పవర్’ విడుదల అవుతూ ఉండటంతో ‘రభస’ కోలుకోవడం కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వరుస పరాజయాలు చూస్తున్న జూనియర్ ను పూరి జగన్నాథ్ కొత్త సినిమా రక్షించ గలుగుతుందా అనే చర్చలు అప్పుడే మొదలు అయ్యాయి.

0 comments:

Post a Comment

 
Top