ఈనెల సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా అఖిల్ తొలి సినిమా లాంచింగ్ భారీ స్థాయిలో ఉండబోతోందని ఫిలింనగర్ టాక్. దీనికి సంబంధించి ఇప్పటికే నాగార్జున వినాయక్ ల మధ్య చర్చలు జరగడమే కాకుండా ఈ సినిమా కధకు సంబంధించి ఒక నిర్ణయానికి కూడ నాగార్జున వచ్చినట్లుగా తెలుస్తోంది.
వినాయక్ చిరంజీవి 150వ సినిమాకు వినాయక్ దర్శకుడిగా మారుతాడు అని ప్రచారం జరుగుతూ ఉంటే మధ్యలో ఈ ఊహించని ట్విస్ట్ తో వినాయక్ చిరంజీవుల సినిమా లేనట్లే అనుకోవాలి. మాస్ సినిమాలను తీయడంలో స్పెషలిస్ట్ గా పేరుగాంచిన వినాయక్ చేతిలో అఖిల్ నటించడం బట్టి మాస్ హీరోగా పరిచయం కావాలి అనుకున్న అఖిల్ కోరిక తీరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.
0 comments:
Post a Comment