Home
»
Jr NTR
»
Kajal Agarwal
»
Lateset Telugu Movie Gossips
»
Movie Gossips
»
puri jagannath
»
Telugu Movie News
»
Temper
»
Tollywood News
» టెంపర్ టీం టెన్షన్ టెన్షన్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , పూరీ ల కాంబినేషన్ లో వస్తున్న ‘టెంపర్' సినిమా ఈ రోజు సెన్సార్ కు వెళ్ళ బోతోంది. అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తుది దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఫిలింనగర్ లో నిన్న హడావిడి చేసింది.
వస్తున్న వార్తల ప్రకారం ప్రముఖ నిర్మాత ఫైనాన్స్ షియర్ అయిన పొట్లూరి వరప్రసాద్ చివరి నిముషంలో ఈ సినిమాను చూసి కొన్ని మార్పులు చేయడంతో పాటు ఈ సినిమాలోని కొన్ని సీన్స్ పట్టుపట్టి తీయించేసారని టాక్.దీనికి కారణం పొట్లూరి వరప్రసాద్ ఈ సినిమాకు ఫైనాన్స్ చేసారు అనే వార్తలు ఫిలింనగర్ లో గట్టిగా వినిపిస్తున్నాయి.
దీనితో దర్శకుడు పూరీకి, నిర్మాత బండ్ల గణేష్ కు ఈ మార్పులు ఇష్టం లేకపోయినా పొట్లూరి వరప్రసాద్ కోసం ఈ మార్పులు చేసారని టాక్. పొట్లూరి మాట వినకపోతే సినిమా విడుదల సమయంలో ఏదో ఒక ఇబ్బంది పెడతారని బండ్ల గణేష్ భయ పడటం కూడా ఈ మార్పులకు కారణం అయింది అని అంటున్నారు.ఇటీవల ‘ఐ' సినిమాకు ఫైనాన్స్ చేసిన పివిపి సినిమా విడుదల సమయంలో కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా ఈ 'సినిమా'ను ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా 1000 ధియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క అమెరికాలోనే 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అని టాక్.
ఇది ఇలా ఉంటే దర్శకుడు పూరి బ్రహ్మానందం, అలీలతో కామెడీ ట్రాక్ లేకుండా అన్ని విషయాలలోనూ భారం జూనియర్ పైనే మోపి యంగ్ టైగర్ ఇమేజ్ ని పూర్తిగా వాడుకుని ఈ సినిమా ద్వారా కొత్త జూనియర్ ను చూపెట్ట బోతున్నాడు అనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఇంతకీ ఈ ‘టెంపర్’ జూనియర్ కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ గా ఎంతవరకు నిలబడగలుగుతుందో చూడాలి.
Related Posts
ఓవర్సీస్ లో టెంపర్ బాక్సాపీస్ టాక్
17 Feb 20150టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మూవీ టెంపర్. ప్రస్తుతం టెంపర్ మూవీకి సంబంధించిన ...Read more »
పూరి పై కోపంగా ఉన్న కాజల్ !
18 Feb 20150‘టెంపర్’ సక్సస్ తో పూరి జగన్నాథ్, జూనియర్లు మంచి జోష్ మీద ఉంటే కాజల్ మాత్రం ఈ సినిమా సక్సస్ ను అ...Read more »
అమెరికాలో టెంపర్ అధిరిపోయే కలెక్షన్స్
20 Feb 20150టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాక్సాపీస్ వద్ద దూసుకుపోతున్న చిత్రం టెంపర్. టెంపర్ మూవీకి సంబంధించిన...Read more »
జూనియర్ ను టార్గెట్ చేసిన దాసరి మాటలు !
03 Mar 20150దర్శకరత్న దాసరి నారాయణరావు నిన్న ప్రముఖ ఎస్వీ. రంగారావు జీవితం పై జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ర...Read more »
అక్కడ రజినీ తర్వాత ఎన్టీఆర్ కే క్రేజినా..?
02 Mar 20150తెలుగు నాట నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉందో తెలుసు. మనోడు నటించిన సినిమాలకు మినిమం ...Read more »
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.